కడప:యువనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఓదార్పు యాత్ర విజయవంతంగా ముగిసింది. అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. జోరుగా వర్షం కురుస్తున్నా జనం జేజేలు పలికారు. సొంత జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర విజయవంతమైంది. ఆయన తన రెండు రోజుల పర్యటనలో పులివెందుల, లింగాల, వేంపల్లి, వేముల మండలాల్లో వై.ఎస్.మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను ఓదార్చారు. పలు చోట్ల వై.ఎస్. విగ్రహాలను ఆవిష్కరించారు. భారీ వర్షంలోనూ యాత్ర కొనసాగింది. వర్షం కురుస్తున్నా తమ అభిమాన నాయకుని రాకకోసం గంటల తరబడి వేచి చూశారు. జగన్ రాకతో పులివెందుల ప్రజలు పులకరించిపోయారు. ఓదార్పు యాత్ర మొత్తం జనసంద్రంగా మారింది. రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలను జగన్‌లో చూసుకుని ఆశీర్వదించారు. యువనేతను చూసి ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. యాత్ర పొడవునా పూలవర్షం కురిపించారు. ప్రజలతో మమేకమైన జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వై.ఎస్.ఆర్.పై వస్తున్న ఆరోపణలపై కడప ఎం.పీ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు కడప జిల్లాలో ప్రైవేటు కార్యక్రమాలను రద్దు చేసుకుని జగన్ ఢిల్లీ వెళ్లారు.
Filed under: వార్తలు |
Leave a Reply