అల్లూరి ఆశయ సాధనకు కృషి చేయాలి


విశాఖపట్నం: స్వాతంత్రం సిద్ధించక ముందు బ్రిటిష్‌ పాలనలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమర శంఖం పూరించి, ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతి ఒక్కకూ కృషి చేయాలని భద్రాచలం బద్రాచలం పార్లమెంట్‌ నియోజక వర్గం మాజీ సభ్యుడు మిడియం బాబురావు పిలుపు నిచ్చారు. విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండల కేంద్రంలోని అల్లూరి సీతారామరాజు యువజన సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం.అర్జున్‌, సింహాద్రి నేతృత్వంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 113వ జయంతి మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎట్టకేలకు డుంబ్రిగుడ కేంద్రంలో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. అల్లూరి కాంస్య విగ్రహన్ని ఏర్పాటు చేసి, తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో ఆనందదాయకమన్నారు. సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా అల్లూరి జయంతి నిర్వహిం చడం అభినందించదగ్గ విషయమన్నారు. అల్లూరి సీతారామరాజు యువజన సేవా సంఘం వ్యవస్థాపకులు శుభాకర్‌, మండ్యాగురు బాబు రావు మాట్లాడుతూ, భద్రాచలం మాజీ ఎం.పి. ద్వారా డుంబ్రిగుడలో స్వాతంత్ర సమరయోధులైన నలుగురి విగ్రహలను ఏర్పాటు చేశామన్నారు. అనివార్య కారణాల వల్ల అల్లూరి విగ్రహ ఏర్పాటులో జాప్యం చేసుకుం దన్నారు. త్వరలోనే కొమరన్‌ భీమన్న, గంటన్నదొర, మల్లుదొర విగ్రహలను డుంబ్రిగుడలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆ సంఘం నాయకులు ఇక్కడి వివిధ పాఠ శాలల్లోని విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అల్లూరి జీవిత చరిత్రపై వకృ్తత్వపు నిర్వహించిన విజేతలుగా నిలిచిన వారికి మాజీ ఎంపి చేతుల మీదుగా బహుమతులందజేశారు. ఈ కార్యక్రమంలో అరకులోయ జెడ్పీటీసీ సభ్యుడు కె.సురేంద్ర, సిపిఎం పాడేరు డివిజన్‌ కార్యదర్శి సూర్యనారాయణ, ఆర్‌.రాము, ఎం.చిట్టిబాబు, గుర్మిసింగు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: