‘అప్పన్న’ నిత్యాన్నదానికి 21 ఏళ్లు!


విశాఖపట్నం, సింహాద్రి అప్పన్న అన్నదాన కార్యక్రమానికి 21 ఏళ్లు నిండాయి. అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అన్న ఆర్యోక్తులను నిజం చేస్తూ సింహాచలేశుని దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం చేసే నిత్యాన్నదానానికి నేటితో 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంతింతైవటుడింతై అన్నట్లు లక్షల రూపాయల విరాళాలతో ప్రారంభమైన అప్పన్న నిత్యాన్నదాన పథకం విరాళాల మొత్తం ప్రస్తుతం సుమారు రూ. 7.20 కోట్లు దాటింది. ప్రతి నిత్యం సింహగిరికి శ్రీ వరాహాలక్ష్మి నృసింహ స్వామిని దర్శించటానికి సదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు శ్రీ స్వామివారి నిత్యాన్న దాన పథకానికి దాతలు ఇచ్చే విరాళాలపై వచ్చే వడ్డీతో భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. నిత్యాన్నదాన ట్రస్టునకు ఉదారులైన దాతలు నుండి పది రూపాయల నుంచి అపరిమితంగా విరాళాలను సేకరించడానికి సింహగిరిపై రాజగోపురం సమీపంలో ప్రసాదాల కౌంటర్ల వద్ద, అన్నదాన భవనం వద్ద గోపాలపట్నం సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. శ్రీస్వామి వారి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష ఆ పై విరాళం ఇచ్చే దాతలను మహారాజ పోషకులుగా, రూ. 50,000లు ఆపైన విరాళం ఇచ్చిన దాతలను రాజపోషకులుగా, రూ. 10,000లు ఆపైన విరాళం ఇచ్చిన వారిని పోషకులుగా, రూ. 1,116లు ఆపైన విరాళం ఇచ్చిన వారిని దాతలుగా పరిగణిస్తారు. దాతలు చెల్లించిన అసలు సొమ్మును జాతీయ బ్యాంకులలో జమ చేసి దానిపై లభించే వడ్డీ మొత్తంలో మాత్రమే దాత పేరు మీద శాశ్వతముగా ప్రతి సంవత్సరం వారు కోరిన రోజున అన్న ప్రసాదం వితరణ జరుపుతారు. సింహాద్రినాథుని నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు సమర్పించిన విరాళాలపై లభించే వడ్డీతో ప్రస్తుతం సోమ, బుధ, గురు, శుక్ర వారాల్లో 400 మందికి, మంగ ళవారం 300 మందికి, ఆదివారం 600 మందికి, శని వారం 700 వందల మందికి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. 2008 నుంచి రాత్రి వేళ సింహగిరిపై బస చేసే భక్తులకు రాత్రిసమయంలో కూడా భోజనాలు ఏర్పా టు చేస్తున్నారు. సింహాద్రి అప్పన్న నిత్యాన్నదాన పథకం కింద ఒక కూర, పచ్చడి, సాంబారు, చిక్కటి కమ్మని మజ్జిగ తో వడ్డించే ఒక ప్లేటు భోజనానికి సుమారు రూ. 23లు ఖర్చు అవుతున్నట్లు ఆశాఖ పర్యవేక్షకుడు ఆర్‌విఎస్‌ ప్రసా ద్‌ తెలిపారు. రాబోయే కాలంలో బ్యాంకులు ఇచ్చే7.25 శాతం కొత్త వడ్డీ రేటు కారణంగా, అడ్డూ ఆపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర సరుకులు, కూరగాయల ధరల కారణంగా భోజనం ధర మరింత భారం అయ్యే అవకాశం ఉంది. ప్రతినిత్యం భక్తులకు పెట్టే భోజనాలతో పాటు వార్షి క ఉత్సహలైన కల్యాణం, చందన యాత్రల సందర్భంగా మరొక 20 వేల మందికి, ముక్కొటి ఏకాదశి, ఆషాడ, వైశాఖ పౌర్ణమి దినాలలో 3 వేల మంది భక్తులకు అద నంగా నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. నిత్యాన్నదాన పథ కం విభాగంలో దేవస్థానానికి చెందిన ఒక పర్యవేక్షకుడు, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌, ఇద్దరు అటెండర్లు, ఫిక్సిడ్‌ పే వర్కర్‌ ఒక్కరు, కూరగాయల కట్టింగ్‌, నీళ్లు అందించటం వడ్డించటం క్లీనింగ్‌, స్వీపింగ్‌ వంటి పనులకు రూ.65. 95పైల రోజు కూలిపై సుమారు 22 మంది పనివారు తమ సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర దేవాలయాలతో పోలిస్తే సింహాద్రి నాథుని నిత్యాన్నదాన పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు దేవస్థానం అధికార్లు కల్పించే సౌకర్యాలు అతి తక్కువనే విమర్శ ఉంది. రూ. 50 వేలు, రూ. లక్షలు విరాళం ఇచ్చే భక్తులకు సింహాచల దేవస్థానం అన్నదాన విభాగం ఒక ఫొటో గుర్తింపు కార్డును ఇస్తారు. దీని ఆధారంగా ఉచితంగా ఇద్దరిని దైవ దర్శనానికి అనుమ తిస్తారు. సింహగిరిపై నిత్య అన్నదాన పథకానికి శాశ్వత భవన నిర్మాణం లేకపోవటంతో కొంత మేరకు నిర్వాహణ కష్టమవటమే కాకుండా, తరచు భవనం మార్పుల కారణంగా లక్షలాది రూపాయలు వృథాగా ఖర్చవుతోంది. తాజాగా నిత్య అన్నదానం జరుగుతున్న గేదెల వారి సత్రం భవన ప్రాంగణం చట్టు ప్రహారీ నిర్మించి, పై కప్పు మరమ్మతులు వంటి పనులకు ఇటీవల ఇంజనీరింగ్‌ శాఖ సన్నాహాలు ప్రారంభిచారు. అదే విధింగా దివ్యక్షేత్రం అభివృద్ధ్ది పనుల్లో భాగంగా శాశ్వత అన్నదాన భవన నిర్మాణానికి రూ.3.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనికి సంబంధించిన స్థలం చదును చేసే పనులు ఇటీవలే ప్రారంభమైంది. ఈ పనులు కూడా పూర్తయితే సర్వహంగులతో భక్తులకు అన్నదానం చేయడం సాధ్యపడుతుందనడంలో సందేహం లేదు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: