మహబూబాబాద్‌ ఘటనపై ఈరోజు మెజిస్టీరియల్‌ విచారణ


వరంగల్‌: కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర సందర్భంగా మహబూబాబాద్‌లో జరిగిన కాల్పుల ఘటనపై ఈరోజు మెజిస్టీరియల్‌ విచారణ జరగనుంది. ఈ ఏడాది మే 28న వరంగల్‌ జిల్లాలో జగన్‌ తలపెట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు ప్రయత్నించారు. కొండా సురేఖ, మురళీలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రజాప్రతినిధులతోపాటు తెలంగాణ వాదులపైనా కేసులు నమోదయ్యాయి. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ ఈ ఘటనపై మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. మహబూబాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో జరగనున్న ఈ విచారణకు ప్రత్యక్షసాక్షులు… కాల్పుల్లో గాయపడినవారు హాజరుకానున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: