దగ్గుబాటి దంపతులపై వెల్లువెత్తుతున్న నిరసన


ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రపై వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి దంపతులపై జగన్ వర్గీయులు మాటలదాడి కొనసాగిస్తున్నారు. పదవి కాంక్షతోనే వారు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు అధిష్టానం చెప్పిందే తాను చెప్పానన్న కేంద్ర మంత్రి పురంధేశ్వరి, తనపై చేస్తున్న విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. కడప ఎంపీ జగన్‌ ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర గురించి వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి దంపతులపై జగన్‌ మద్దతుదారులు మండిపడుతున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు ఏ స్వార్ధం లేకపోతే జగన్‌ కు లేఖ రాయాల్సిన అవసరం ఏమిటని అనకాపల్లి ఎంపి సబ్బం హరి ప్రశ్నించారు.

ఓదార్పుయాత్రను అనవసర రాద్దాంతం చేయొద్దని ఆయన కోరారు. ఎన్టీ రామారావు కూతురు అల్లుడుగా దగ్గుబాటి దంపతులకు ఉన్న గౌరవాన్ని వారే పోగొట్టుకుంటున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. సెప్టెంబర్‌ 3 నుంచి ప్రకాశం జిల్లా లో జగన్‌ ఓదార్పు యాత్ర జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. జగన్‌ ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిపై ప్రకాశం జిల్లాలో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామస్తలు పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దగ్గుబాటి డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: