సహ చట్టంలో నిర్మాణాత్మక మార్పులు


హైదరాబాద్‌: సమాచార హక్కు చట్టంలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించడం వీలవు తుందని కేంద్ర ప్రభుత్వ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ సి.డి.అర్హ పేర్కొన్నారు. ‘సమాచార హక్కు చట్టం అమలు’ పై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాచార హక్కు ప్రజా నిఘా సమితి, సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌లు సంయుక్తంగా నిర్వహించిన సమీక్షా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాచార హక్కు చట్టాన్ని విజయవంతంగా అమలు చేసే విషయం లో ప్రజల భాగస్వామ్యం, జాగరూకత, ప్రాముఖ్యత, మీడియా పాత్ర, సమాజం, పలు గ్రూపులు వంటి ఆంశాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు. పర్యవసనంగా ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతు న్నామని ఆయన తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా తమకు కావాల్సిన సమాచారం సేకరించేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతుండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలో సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ సేవలు ప్రశంస నీయమని అర్హ అన్నారు. ఈ చట్టం సత్వర అమలుకు ప్రభుత్వం అవసరమైన మేరకు నిధులు, వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయా ప్రభుత్వ కార్యాల యాలు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ముందున్నారని తెలిపారు. తెలం గాణలో 36శాతం, ఆంధ్రలో 48శాతం, రాయలసీమలో 50 శాతం వినతిపత్రాలు ఇటీవల కాలంలో రావడమే ఇందుకు నిదర్శనమని అర్హ వివరించారు. 2005లో చట్టం ప్రారంభించినపుడు తక్కువ అప్లికేషన్లు రాగా 2009లో వాటి సంఖ్య 65 శాతానికి అంటే 65973కు పెరిగిందన్నారు. 2005లో గవర్నర్‌ షిండే, ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి, స్పీకర్‌ సురేష్‌రెడ్డిలు ఈ చట్టం అమలుకు తాను చేసిన సిఫారసులను అమలు చేయడానికి అంగీకారం తెలిపారని ఆయన గుర్తుచేశారు. సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ చైర్మన్‌ ఎన్‌.భాస్కర్‌రావు మాట్లాడుతూ, ప్రజలు ఒత్తిడి పెంచి తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకోవచ్చని తెలిపారు. అప్పట్లో సమచార కమీషనర్‌గా ఉన్న అర్హ ఈ చట్టం కార్యరూపం దాల్చేందుకు కృషి చేసారన్నారు. వచ్చిన ఫిర్యాదులపై సమాచార కమీషనర్‌, సిబ్బంది స్పందించడం లేదని, పరిష్కారం చూపడం లేదని, చట్టాన్ని ఖాతరు చేయనట్లుగా వ్యవహరిస్తున్నారని, సమాచారం ఇచ్చే బాధ్యతను పట్టిం చుకోవడం లేదని, చట్టంపై వారికి అవగాహన లేదని వీటి అమలుకు అధికారాలు లేవని అర్హ గతంలో ప్రభు త్వానికి నివేదిక ఇచ్చారని ఆయన వివరించారు. దీనిని బట్టి ప్రభుత్వం, యంత్రాంగం పూర్తిస్థాయిలో పని చేయ డం లేదని స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర మారుమూల గ్రామాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ టి.పురుషోత్తమరావు మాట్లాడుతూ, ప్రజలకు సమాచారం ఇవ్వడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, చాలా ఆలస్యంగా స్పందిస్తున్నారని విమర్శించారు. పెట్టుబడిదారీ విధానం ప్రకృతిపైనా, మానవ సంబంధాల పైనా చెడు ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం తగిన సమయంలో బట్వాడా కాకపోవడానికి ఇదీ ఒక కారణమని ఆయన తెలిపారు. ఈ కార్యక్ర మంలో కన్వీనర్లు గోపాలరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: