పోలీసుల వేధింపులకు విద్యార్ధి బలి?


చెన్నై: నగర శివారు ప్రాంతంలో అశోక్‌ కుమార్‌ అనే లా విద్యార్ధిని పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారు. దాంతో ఆ విద్యా ర్థి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కొన ఊపిరితో పోరాడుతున్నాడు. ఈ ఘటనకు ముందు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ విద్యార్థి ఉద యం బస్సులో ప్రయా ణిస్తుండగా కొంతమంది ప్రయాణి కులతో గొడవ పడ్డాడు. ఈ గొడవలో విద్యార్ధిని ముందుగా ప్రయాణి కులు కొట్టారు. అనంతరం ప్రయా ణికులు పోలీసుకు అప్పగించారు. దాంతో రెచ్చిపోయిన పోలీసులు వారి ప్రతాపాన్ని అశోక్‌ కుమార్‌పైన చూపించారు. అయితే పోలీసులు మాత్రం ప్రయాణికులు కొట్టడం వల్లే తీవ్రంగా గాయపడ్డాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగి కొన్ని గంటలు గడిచిన తరువాత గాయ పడిన విద్యార్థి ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను కోమా లోనే వున్నాడు. బాధితుడు అశోక్‌ కుమార్‌పై పోలీసుల చర్యకు తీవ్రంగా స్పందించిన తమిళనాడు ముఖ్య మంత్రి ఎం కరుణానిధి వైద్య ఖర్చుల నిమిత్తం అవసరమైన నిధులను విడుదల చేశారు. దూషించడం, తీవ్రంగా గాయపరచడం లాంటి చర్యలకు పాల్పడిన ఇద్దరు ఇన స్పెక్టర్‌లతో సహా ఎనిమిది మంది పోలీసులపై అశోక్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు అధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ విద్యార్థి డ్రాయర్‌ని కూడా తీయించి తీవ్రంగా చిత్ర హింసలు పెట్టారు. ఈ ఘటనలో ఆతని పళ్ళు కూడా విరిగాయి. అశోక్‌ కుమార్‌ చేతులు, కాళ్ళకు తగిలిన దెబ్బలకు తీవ్రంగా గాయపడ్డాడు. కుమార్‌ని ఒక ఉగ్రవాదిలా చూశారని బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీ సులు మాట్లాడటానికి నిరాకరిం చారు. అశోక్‌ ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో కొన ఊపిరితో పోరాడుతున్నాడు. ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు విచారణకు ఆదేశించింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: