పురంధేశ్వరి జోక్యం తగదు


తిరుపతి: జగన్‌ వ్యవహారంలో పురంధేశ్వరి తలదూర్చడం తగదని ఎమ్మెల్సీ వైఎస్‌ వివేకానంద రెడ్డి హితవు పలికారు. టిటిడిలో అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణకు డిమాండ్‌ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన భూమన కరుణాకర్‌రెడ్డికి వివేకా మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు పలువురు కుట్రపన్నుతున్నారని వివేకా ఆరోపించారు. అందులో భాగం గానే పురంధేశ్వరి కాంగ్రెస్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని అన్నారు. జగన్‌ యాత్ర వల్ల కాంగ్రెస్‌ పార్టీకి మరింత బలం చేకూరుతుందని చెప్పా రు. పార్టీ అధిష్టానం కూడా సహకరి స్తుందన్న నమ్మకం వుందన్న ఆశాభా వం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోని దగ్గుపాటి దంపతులు నేడు జగన్‌ను అడ్డుకో వాలని చూడటం భావ్యంకాదన్నారు. టిటిడి వ్యవహారం లో బి.కరుణాకర్‌రెడ్డి నిర్దోషి కాబట్టే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకు న్నారని తెలిపారు. ఆయన దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: