చైనాలో వరదలుచైనాలో వరదలు


బీజింగ్‌: చైనాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న యాలు నదికి సంభవించిన వరదల కారణంగా ముగ్గురు గల్లంతయ్యారు. మరో 50,000 మందికి పైగా ప్రజలను అక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డాండాంగ్‌ నగరంలో దాదాపు 230 నివాసాలు ధ్వంసమయ్యాయి. కొన్ని రవాణా, విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్ధలు దెబ్బతిన్నాయి. అయితే ఈ వరదల వలన ఎవరూ మరణించలేదని స్థానిక అధికారులు పేర్కొన్నారు. కాగా డాండాంగ్‌లోని వరద నియంత్రణ కార్యాలయం గల్లంతైన వారి సంఖ్యను ధృవీకరించింది. అలాగే అక్కడ నుండి తరలించిన వారి సంఖ్యను కూడా ధృవీకరించింది. అత్యవసర పరిస్ధితులకు సంబంధించిన ప్రయత్నాలపై ఇంతకు మించి సమాచారం ఇవ్వలేనట్లు తెలిపింది. అంతకు ముందు మరో అధికారి మాట్లాడుతూ పరిస్థితి అంత తీవ్రంగా లేదని చెప్పారు. నది పొడవున ఉన్న కొన్ని రహదారులు వరదనీటితో మునిగిపోయాయి. డాండాంగ్‌లోని కొన్ని నివాసాలు మునిగిపోయాయి. ఇక్కడకు మోకాలు లోతున వరదనీరు వచ్చి చేరింది. చైనాలో శుక్రవారం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం వలన యాలూ నది నీటి ప్రవాహం ఉధృతంగా మారింది. కాగా నది ఒడ్డున తెగిపడుతున్న కరకట్టలకు అడ్డుగా ఇసుకబస్తాలను వేస్తున్నారు. నది ప్రక్కన ఉన్న ప్రాంతాలు మాత్రమే వరదలకు ప్రభావితమ య్యాయని, డాండాంగ్‌ లోతట్టు ప్రాంతానికి ప్రమాదమేమీ లేదని సంబంధిత అథికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో శనివారం ఈదురుగాలులు వీచాయి. చైనాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గత దశాబ్దకాలంలో ఎన్నడూ రానంతగా వరదలు దేశాన్ని ముంచెత్తాయి. చైనాలో ఈ ఏడాది సంభవించిన వరద సంబంధిత ప్రమాదాల్లో దాదాపు 3,900 మంది మరణించారు. కొంతమంది గల్లంతయ్యారు. మరణించిన వారిలో 1,750 మంది మారు మూల ప్రాంతాల్లో కొండచరియలువిరిగి పడటంతో ప్రాణాలు కోల్పోయారు. కాగా వరద విపత్తు నుండి ప్రాణాలతో బయటపడిన వారి సహాయార్ధం వ్యక్తిగత విరాళాలను సేకరించేందుకు చైనా అధ్యక్షులు హూ జింటావోతో సహా పలువురు ఉన్నతస్థాయి కమ్యూనిస్టు నేతలు ముందుకు వచ్చారు. యాలు నదికి వరదలు రానున్నాయనే హెచ్చరికలతో ఈ మాసారం భంలో మత్స్యకారులు నదిలోకి వెళ్ళడాన్ని నిషేధించారు. ఉత్తర కొరియా సరిహద్దు ప్రాంతంలో ఈ ఏడాది వేసవిలో సంభవించిన వరదల కారణంగా పలు నివాసాలు కొట్టుకు పోయాయి. రహదారులు, రైల్వే లైన్లు కూడా కొట్టుకుపోయాయి. పంటపొలాలు నీట మునిగాయి. పలువురు మరణించారు. 2007లో సంభవించిన వరదల కారణంగా దాదాపు 600 మంది మరణించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: