ఎరువులు సరఫరా చేయాలి


విజయవాడ: ఎరువులు సక్రమంగా అందక పోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, యుద్ధ ప్రాతిపదికన ఎరువులు సరఫరా చేయాలని, అలాగే పంట రుణాలు రీ షెడ్యూల్‌ చేసి, కొత్తగా రుణాలు మంజూరు చేయాలని అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కృష్ణా జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా జరి గింది. జిల్లా వ్యాపితంగా తరలి వచ్చిన రైతులు, రైతు సంఘ నాయ కులు, కార్యకర్తలు వర్షాన్ని సైతం లెక్కచేయ కుండా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం రైతు సం ఘం జిల్లా అధ్యక్షులు కొమ్మన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో కొల్లి నాగేశ్వరరావు మాట్లా డుతూ ఖరీఫ్‌ సీజన్‌కు 11.02 లక్షల టన్నుల యూరియా అవసరమని ప్రకటించినా రాష్ట్రానికి వచ్చింది మాత్రం 6.18 లక్షల టన్నులేనని, వచ్చిన ఎరువుల్లో కొన్ని మిక్సింగ్‌ కోసమని ఫ్యాక్టరీలకు తరలిస్తు న్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌లో యూరి యా దొరక్క రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నార న్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల పరిస్థితి కూడా అలాగేవుందన్నారు. ఎరువుల కొరత వల్ల వ్యాపారులు బస్తాకు రు. 50 నుండి రు.100 వరకు అదనంగా రేట్లు పెంచి అమ్ముతు న్నారని, అలాగే బ్లాక్‌ మార్కెట్‌ అమ్మకాలు పెరిగిపోయాయని, వీటిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.వి.గోపాలరావు, మాజీ ఎం.ఎల్‌.ఎ. కె.సుబ్బరాజు కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మల్నీడి యల్ల మందారావు, కార్యదర్శులు చుండూరు సుబ్బారావు, గొరిపర్తి రామారావు, జిల్లా నాయకులు తాతినేని కొండ య్య, యడ్ల కృష్ణ కిషోర్‌, వెలగపూడి ఆజాద్‌, చలసాని రామారావు, ఆర్‌. పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: