వయోవృద్దులకు ఆరోగ్య బీమా


వరంగల్: ఇతర దేశాలలో వయోవృద్దులకు కల్పిస్తున్న విశ్రాంతి కేంద్రాలు, ఆరోగ్య భీమా , బ్యాంకుచే వృద్దులకు అధిక వడ్డి , సామాజిక భధ్రత వంటి సదుపాయాలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులలోచార్జీలలో రాయితీ, వంటి సౌకర్యాలను రాష్ట్రంలోని వయో వృద్దులకు కల్పించాలని సీనియర్‌ సిటిజన్‌ సిటిజన్‌ ఫారం వరంగల్‌ అధ్యక్షులు జి.జనార్థన్‌రెడ్డి , ఐఎఎస్‌, ఒక ప్రకటనలో తెలిపారు. వయోవృద్దుల సమస్యల పరిష్కారము కొరకు సీనియర్‌ సిటిజన్‌ ఫారం ఆధ్వర్యంలో హన్మకొండలో సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ సమావేషానికి జిల్లాలో రిటైరైన ఉద్యోగులందరు హజరై తమ హక్కులకై పోరాడాలని నిర్ణయించిన ట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్దుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వృద్దుల సంక్షేమం పై శ్రద్ద కనపరచడం లేదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డా. అనసూది చంద్రమౌళి, ఆర్‌.సుదర్శన్‌ రెడ్డి, ఆనందరావు, రాజారెడ్డి, డి.రంగారెడ్డి, కె.గోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: