రైతులకు అందుబాటులో ఎరువులు


ఖమ్మం: జిల్లా అధికారులు, బ్యాంకర్లు రైతులకు ఎరువులు, బ్యాంక్‌ రుణాలు సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యన్‌.నాగేశ్వరరావు కొరారు. గురువారం రోజున స్థానిక టిటిడిసి హల్‌ నందు పంట ఋణాలు సరఫరా పై నిర్వహించిన సమీక్ష సమావేశములొ జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బముగా కలెక్టర్‌ మాట్లాడుతు, సమాజంలో జనాభా పెరుగుదలతోపాటు వారికి కావలసిన అవసరాలు కూడ తీర్చవలసిన అవశ్యకత ఉన్నదని కలెక్టరు చెప్పారు. సరైన సమయంలొ ఎరువులు పంట ఋణాలు ఇస్తేనే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్‌ అన్నారు. ఎరువుల సరఫరా విషయంలోని గాని బ్యాంకులు రుణాలు అందించుటలో గాని జాప్యం చేసిన యెడల సంబందిత అదికారుల పై చర్యలు తీసుకొంటానని కలెక్టరు చెప్పారు. వ్యవసాయ అదికారులు ఎరువులు పురుగుమందులు విత్తనాలు కొరత రాకుండా చూడవలసిన బాద్యత మీ పై వున్నదని రైతులకు బాద పెట్టవద్దని జిల్లాలో వివిధ బ్యాంకు శాఖాలున్నప్పటికి బ్యాంకర్స్‌ రుణాలు అందించుటతో అలస్యం చేస్తున్నారని కలెక్టర్‌ అన్నారు. అవకతవకలు పిర్యాదులు లేని సహకార సంఘాల ద్వారా 70 శాతము ఎరువులు పంపణి చేస్తామని కలెక్టర్‌ సమావేశములొ పేర్కొన్నారు. డీలర్సు లేకపోవుట వలన 50 శాతము ఎరువులు ప్రవేటు సెక్టార్స్కు 50 శాతము కో అపరేటివ్‌ సెక్టార్స్కు వచ్చినవని తెలిపారు. జిల్లాలో యూరియా 5 వేల టన్నులు, డిఎపి 10 వేల టన్నులు కావాలని ప్రభుత్వాన్ని కొరినామని కలెక్టరు చెప్పారు. ఎరువులను బ్లాక్‌అ మార్కెట్‌ చేసిన యెడల కాని ఎక్కువ ధరలకు వక్రయించిన వారి పై కఠిన చర్యలు తీసుకొంటామని కలెక్టర్‌ వెల్లడించారు. సమావేశంలొ తల్లాడ జడ్పిటిసి మెంబర్‌ బాస్కర్రావు మాట్లాడుతూ రైతులకు ఇచ్చె ఋతాలను సక్రమయిన పద్దతిలో ఇవ్వాలని, కౌలు రైతులకు కూడ ఋణాలివ్వాలని పంటల నష్ట పరిహిరాన్ని కూడ పెంచాలని కొరారు. జాయింట్‌ లైబులిటి గ్రూపుల ద్వరా కూడ రైతులకు ఋణాలందించాలని ఆయన కోరారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: