ప్రాధాన్యతలకు అనుగుణంగా పాలన


విశాఖపట్నం: ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించేందుకు, ప్రజా సమస్యలను గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు తప్పని సరిగా నెలకు 15 రోజుల పాటు క్షేత్ర పర్యటన చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.శ్యామలరావు ఆదేశించారు. గురువారం సాగర్‌ నగర్‌ వద్దనున్న సెనోరా బీచ్‌ రిసార్టులో జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు శాఖల అధికారులకు లక్ష్యాలుగా నిర్థేశించిన ప్రగతి సూచికల అమలు (డాష్‌ బోర్డు ఇండికేటర్లు), ప్రజాపథం, పల్లెపిలుపు, ప్రజావాణిలో ప్రజల నుండి అందిన వినతులు, ప్రజా ప్రతినిధుల విజ్ఞాపనల పరిష్కారం, ముఖ్యమైన పనుల ప్రగతి తదితర అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అధికారికి నిర్థేశించిన ప్రగతి సూచికలను వెబ్‌సైట్‌లో పొందుపర్చడం జరిగిందన్నారు. సంబందిత అధికారులు వాటిని ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ చేస్తూ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాల ప్రగతిని పొందుపర్చాలని ఆదేశించారు. టూర్‌ డైరీలను కూడా పొందుపర్చాలని సూచించారు. వీటిని తరచూ పర్యవేక్షిస్తూ శాఖల పనితీరును మెరుగు పర్చే చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ, విద్య, వైద్య, ఆరోగ్య కార్యక్రమాలను, సంక్షేమ పధకాల అమలును మరింత మెరుగు పర్చాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలును మెరుగుపర్చాలని, శిధిలావస్థలోనున్న పాఠశాల భవనాలన జాబితాను రూపొందించి, వాటిని కూల్చివేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా విద్యా శాఖాధికారి ఎమ్‌.సూర్యనారాయణను ఆదేశించారు. ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి. వసతి గృహాలలో విద్యా ప్రమాణాలను మెరుగు పర్చేందుకు, విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అదికారులను ఆదేశించారు. మత్సకారుల సంక్షేమానికై ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలను విస్తృతంగా అమలు పర్చి మత్సకారులకు లబ్దిచేకూర్చేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందిచాలని ఆశాఖ సహాయ సంచాలకును ఆదేశించారు. గృహ నిర్మాణాల ప్రగతిలో జిల్లా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 వ స్థానం నుండి 12 వ స్థానానికి తెచ్చేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు. భూసార పరీక్షలపై రైతులలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. భూ సారానికి అనుగుణంగా రైతులు పంటలు పండించినట్లైతే మంచి దిగుబడులను పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రజా వినతుల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదుః వినతులు సమర్పిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలు ఎదుర్కొంటూ వినతులను సమర్పిస్తున్నారన్నారు. వాటికి అత్యంత ప్రాధాన్య నిస్తూ పరిష్కరించాల్సిన భాద్యత అధికారులపై ఉందన్నారు. ఈ విషయంలో అత్యంత ప్రాధాన్యత నివ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు . ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ వాటిని సత్వరమే పరిష్కించేందుకు సంబందిత అధికారులతో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సినదిగా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణను ఆదేశించారు. వినతుల పరిష్కారం నాణ్యతను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌.సి. కార్పొరేషన్‌ ఇ.డి. శ్రీనివాస్‌ను ఆదేశించారు. గత కొన్ని మాసాల నుండి పెండింగ్‌లో నున్న వినతులను పరిష్కరించకుండా అలక్ష్యవైఖరిని ప్రదర్శిస్తున్న విశాఖపట్నం డి.ఎఫ్‌.ఓ., దేవాదాయ శాఖ కార్య నిర్వహణాధికారి, డి.ఆర్‌.డి.ఏ. పి.డి., పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు, మహా విశాఖ నగరపాల సంస్థ ఎ.డి.సి. కృష్ణమూర్తిలకు తాఖీధులు జారీచేస్తూ సంజాయిషీలను అడగాలని జిల్లా రెవిన్యూ అధికారి డి.వెంకట రెడ్డిని ఆదేశించారు. అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ పి.ఓ. నిర్మలా, జిల్లా పరిషత్‌ సి.ఇ.ఓ. పి.ఎ.శోభ, డి.ఆర్‌.డి.ఏ. పి.డి. శ్రీకాంత్‌ ప్రభాకర్‌ , డుమా పి.డి. సత్యసాయి శ్రీనివాస్‌, గృహ నిర్మాణ సంస్థ పి.డి. ఎల్‌.రవికుమార్‌, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకు భద్రాచలంతోపా పలు శాఖ జిల్లా అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: