గ్రామీణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి


ఒంగోలు: ప్రజలకు సురక్షితమైన నీరు అందించి నీటిద్వారా వ్యాపించు వ్యాధుల బారినపడకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రకాశం జిల్లా కలెక్టరు కాంతిలాల్‌ దండే పేర్కొన్నారు. గురువారం ఉదయం సి.పి.ఓ సమావేశ మందిరంలో నీటి కాలుషిత వ్యాధులు మరియు కీటకజనిత వ్యాధుల నివారణ జిల్లా టాస్క్‌ఫర్స్‌ కమిటీ సమావేశంలో అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వ్యాధుల బారినపడిన సంఖ్య ఎక్కువగా వుందని ఈ సీజన్‌లో కాచి చల్లార్చిన నీటిని ప్రజలు వినియోగించుకునేటట్లు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం వుందని కలెక్టరు తెలిపారు. మండలంలోని తహసీల్దార్‌ , మండల అభివృద్ధి అధికారి, ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌ ఏ.ఇ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య అధికారిని మండల స్థాయి కమిటీలో సభ్యులుగా, గ్రామంలో గ్రామ రెవిన్యూ అధికారి, పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్‌, ఏ.ఎన్‌.ఎమ్‌, ఆరోగ్య కార్యకర్తను గ్రామస్థాయిలో కమిటీ సభ్యులుగా చేసుకొని పారిశుద్యంపై చర్యలు గైకొనాలన్నారు. గ్రామాలలో పారిశుద్యానికి సంబంధించిన కిట్స్‌ పంపిణి చేయడం జరిగిందని వీటి వినియోగ పరిస్థితులను పరిశీలించాలన్నారు. ఎప్పటికప్పుడు త్రాగునీటిని ల్యాబ్‌ నందు పరీక్షించాలని, అలాగే నీటి సరఫరా అయ్యే పైపులైన్లు లికేజిలు లేకుండా చూడాలన్నారు. బోర్ల వద్ద ప్లాట్‌ఫారంలు లేని వాటిని గుర్తించి ప్లాట్‌ఫారంలు ఏర్పాటుకు ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రక్షిత మంచినీటి పథకంకు చెందిన వాటిని 15 రోజులకు ఒకసారి శుభ్రపరచి నాణ్యమైన త్రాగునీటిని సరఫరా అయ్యేటట్లు అధికారులు చూడాలన్నారు. ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌ ఎస్‌.ఇ తమశాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించుకొని పైపులైను లికేజిలు, బోర్లమరమ్మత్తులు వెంటనే చేపట్టాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనుల జీవన స్థితిగతులను గుర్తించి ప్రాణాంతక వ్యాధుల బారినపడకుండా సీజనల్‌ వ్యాధులపై అవగాహన, పారిశుద్యంపై ప్రచారం నిర్వహించాలన్నారు. అలాగే మత్స్యకారుల కమ్యూనిటికి ప్రాధాన్యత ఇచ్చేటట్లు కార్యాచరణ ప్రణాళికలు తయారుచేయాలని కలెక్టరు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలుషితమైన నీటివలన, పరిసరాల పరిశుభ్రత లేని కారణంగా వ్యాపించే వ్యాధుల గురించి ప్రజలలో విస్తృత ప్రచారం చేసి వారిలో చైతన్యం కల్పించాలని కలెక్టరు తెలిపారు. అలాగే ఈ నెల 23వ తేది నుండి వారం రోజలపాటు మండల, గ్రామస్థాయిలలో పరిసరాల పారిశుద్యంపై అవవగాహన సదస్సులు (శానిటేషన్‌ కాంపైన్‌) నిర్వహించాలన్నారు. చీమకుర్తి గ్రానైట్‌ క్వారీల ప్రాంతంలో నీరు నిల్వవున్నందున దోమలు ఎక్కువగా వ్యాప్తిచెంది వివిధ రకాలైన వ్యాధులు ప్రబలే అవకాశం వుందన్నారు. జిల్లాలో 147 మలేరియా కేసులు గుర్తించడం జరిగిందని దీనిలో 47 కేసులు చీమకుర్తిలోనే నమోదుకాబడినట్లు కలెక్టరు తెలిపారు. దోమలు, దోమల లార్వాల నిర్మూలన కొరకు గంబూషియా చేపలను, ఆయిల్‌ బాల్స్‌, ఫాగింగ్‌ , స్ర్పేయర్స్‌ ద్వారా నిర్ములించే ప్రజలు మలేరియా వ్యాధిబారిన పడకుండా చూడాలని ఏ.డి.మైన్స్‌, ఏ.డి.ఫిషరీస్‌ను కలెక్టరు ఆదేశించారు. గతంలో కంటే 3 రెట్లు మలేరియా వ్యాధులు ఎక్కువగా చీరుకుర్తిలో నమోదు అయినవని కలెక్టరు వివరించారు. దోమల నిర్మూలనకు స్ర్పేయర్స్‌, ఫాగింగ్‌ , ఆయిల్‌బాల్స్‌ విరివిగా వినియోగించాలని అవసరమైనచోట కొత్త స్ర్పేయర్స్‌ కొనుగోలుచేసి వాడాలన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలోని వసతిగృహాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు పరిశుభ్రంగా వుండేటట్లు చూడాలన్నారు. 13వ ఫైనాన్స్‌ కమీషన్‌ నిధులను త్రాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలన్నారు. ఈనెల 21వ తేది నాటికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. తాహసీల్దార్‌ , మండల అభివృద్ధి అధికారి, ప్రాథమిక వైద్య అధికారి, మిగిలిన అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లాపరిషత్‌ సి.ఇ.ఓ టి.వీరభద్రయ్య, జోనల్‌ మలేరియా అధికారిణి వాణిశ్రీ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ప్రసాదరావు, జిల్లాపంచాయితీ అధికారిణి శ్రీదేవి, కందుకూరు, మార్కాపురం రెవిన్యూ డివిజనల్‌ అధికారులు నర్సింగరావు, రాఘవరావు, ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌ ఎస్‌.ఇ గోపాలక్రిష్ణ, ఏ.డి.మైన్స్‌ జగన్నాధరావు, ఏ.డి.మత్స్య శాఖ వెంకట్రావు, డి.డి. సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి జనార్థనరావు, తాహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: