కొనసాగుతున్న కర్నూలు కలెక్టర్ ప్రజావాణి


కర్నూలు: ప్రజావాణికి వచ్చే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు అధికారులు తీసుకుంటే, సమస్యలు వుండవని జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రజావాణికి, ప్రజాదర్బార్‌ కు వచ్చే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమయం కేటాయించి తాము ఎవరిని ఆదేశిస్తే వారే సమస్యను పరిష్కరించి వాటికి సంబంధించిన నివేదిక తనకు పంపాలని కలెక్టర్‌ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మా గ్రామ పొలిమేరల్లోని పొలం సర్వే నెంబరు 860/ ఎ1, 19.30 ఎకరాల సెంట్లలో బావి, కరెంట్‌, మోటరు వుందని, మామిడి, టెంకాయ, టేకు, నిమ్మ, ఉసిరి, కుంకుడుకాయ చెట్లను డ్రిప్పు ద్వారా పెంచుతున్నామని గణి చెరువు మునకవల్ల చెట్లు నీళ్లలో మునిగి తీవ్ర నష్టం జరిగిందని, అప్పుతెచ్చి, నష్టపోయామని, చెట్లకు నష్టపరిహారం ఇప్పించాలని, ఓర్వకల్లు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామనివాసి నాగేశ్వరరెడ్డి తండ్రి సుబ్బారెడ్డి కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. నేను పుట్టుకతోనే వికలాంగురాలునని, అయినప్పటికి ఎమ్‌.ఎ, బి.ఇడి, కంప్యూటరు కూడ చేశానని, ఎక్కడ ఉద్యోగం కూడ రాలేదని, మాఇంటి ఆర్థిక పరిస్థితులు బాగా లేవని కస్తూరిబా బాలికల రెసిడెన్సియల్‌ స్కూల్‌ నందు సోషియల్‌ టీచరుగా పనిచేయుటకు దరఖాస్తు సమర్పించుకున్నానని, పరిశీలించి అవకాశం కల్పించాలని పి. రజనీ కుమారి కలెక్టరుతో మొరపెట్టుకొంది. బనగానెపల్లి మండలం, కైప గ్రామానికి చెందిన 10 మంది ఎస్‌.సిల మని, కిరాణం అంగడి, గుడ్డల వ్యాపారం, టైలర్‌ షాప్‌, చీరల వ్యాపారం, పాడిపరిశ్రమ, చర్మపరిశ్రమ, వివిధరకాల వ్యాపారాలు చేసుకోవడానికి ఎస్‌.బి.ఐలో రుణం, ఎస్‌.సి కార్పోరేషన్‌ ద్వారా సబ్సిడీ మంజూరు చేయించాలని మాసుపల్లి రత్నమయ్య, జమ్మీ ప్రభావతి, ఇతరులు కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. కూలీ-నాలీ చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగుచేసుకొంటూ జీవనం సాగిస్తున్నామని, గత సంవత్సరం ఆర్థిక స్తోమత లేక పంటవేయలేదని, బతకడానికి హైదరాబాదుకు వెళ్లామని, ఈ సంవత్సరం బాగా వర్షాలు రావడం వల్ల పంటవేసుకుందామని పొలందగ్గరకు వెళితే దొరపల్లి బోయ వెంకటరెడ్డి, తిమ్మక్క ఇతరులు దౌర్జన్యంచేసి నన్ను గ్రామం నుంచి వెళ్లగొట్టినారని, అధికారులను పంపి సర్వే చేయించి నాభూమిని నాకే ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, డోన్‌ మండలం దొరపల్లి గ్రామానికి చెందిన ఎరుకల జాలగిరి సుంకన్న భార్య బజారమ్మ కలెక్టరును కోరారు. కార్పెంటర్‌ వృత్తిని చేసుకొని జీవించడానికి బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయించాలని కర్నూలు నగరం, క్రిష్ణానగర్‌ కు చెందిన మదార్‌ సాహెబ్‌, ఇతరులు కలెక్టరును వినతిపత్రం ద్వారా కోరారు. బాడుగ ఇంట్లో నివశిస్తూ అద్దెలు చెల్లించలేని పరిస్థితిలో వున్నామని, కర్నూలు నగర పరిసరాల్లో ఇంటి స్థలంతో పాటు ఇళ్లు మంజూరు చేసి ఇప్పించాలని కర్నూలు బాలాజీ నగర్‌ నివాసి ఉమాదేవి భర్త వీరాకృష్ణ కలెక్టరుతో మొరపెట్టుకున్నారు. 44వ వార్డు రోజా దగ్గర పూరిగుడిసెల్లో నివశిస్తున్నామని, మాఇండ్లకు కరెంటు మీటర్లు ఏర్పాటు చేయడానికి విద్యుత్‌ అధికారులను ఆదేశించాలని, కటిక చీకటితో విషపురుగుల భయం వుందని, ఇంతకు ముందు పాముకాటుకు గురైన సందర్బాలు కూడ వున్నాయని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కరెంటు మీటర్లు ఏర్పాటు చేయించాలని పెద్ద ఎత్తున రోజా దర్గా దగ్గర మహిళలు ప్రజావాణికి వచ్చి దరఖాస్తుతో పాటు కలెక్టరుకు విజ్ఞప్తిచేశారు. ప్రజావాణి కార్యక్రమం కలెక్టర్‌ తో పాటు డి.ఆర్‌.ఓ సూర్యప్రకాశ్‌, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: