కార్పొరేట్‌కు ధీటుగా డి.ఎస్‌.ఆర్‌.లో వసతులు


నెల్లూరు: కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా డి.ఎస్‌.ఆర్‌. ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా పటిష్టమైన చర్యలు తీసుకొంటున్నట్లు జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ కాకాణి గోవర్థన్‌ రెడ్డి తెలిపారు. గురువారం డి.ఎస్‌.ఆర్‌. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి అవసరమైన మేర నిధులు మంజూరు చేయించి డి.ఎస్‌.ఆర్‌. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రిగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. డి.ఎస్‌.ఆర్‌. ప్రభుత్వ ఆసుపత్రిలో 5 కోట్ల 10 లక్షలతో ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా 3 కోట్ల 50 లక్షలతో ప్రాథమిక అవసరాలకు సరిపడు వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో సమకూర్చుకోవడం జరుగుతుందన్నారు. 80 లక్షలతో ఆసుపత్రిలో రూములను ఆధునీకరించుకోవడం కోసం, మరో 80 లక్షలు జీతభత్యాల చెల్లింపుల కోసం ఖర్చుచేయడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతులలో భాగంగా రెండు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఒక బ్లడ్‌ బ్యాంక్‌ వాహనం కూడా మంజూరైందన్నారు. 18 మంది నర్సులను కూడా నియమించడం జరిగిందన్నారు. 2 కోట్ల 80 లక్షలతో రేబాల చిన్నపిల్లల ఆసుపత్రికి నూతన భవనం మంజూరయిందన్నారు. 5 కోట్లతో జూబ్లీ ఆసుపత్రి 100 పడకలను 200 పడకలుగా మార్చి మౌలిక సదుపాయాలు కల్పించుటకు ప్రతిపాదనలు పంపామన్నారు. తొలుత చైర్మెన్‌ ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాధికి చికిత్స పొందుతున్న పొదలకూరు మండలం తోడేరు గ్రామాకి చెందిన వి. రమణమ్మను పరామర్శించారు. ఈ సందర్బంగా రమణమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి చైర్మెన్‌ వివరిస్తూ ఈమే అనారోగ్యంతో నగరంలో వివిధ ఆసుపత్రులలో చికిత్సపొంది వ్యాధి తగ్గక చెన్నైకు వెళ్లడం జరిగిందని, అక్కడ రోజుకు 10 వేల వంతున షుమారు 2 లక్షలు ఖర్చు కాగలదని, అయినప్పటికి ఆ వ్యాధి తగ్గుతుందనే గ్యారంటీ ఇవ్వకపోవడంతో, ఆమె తిరిగి నెల్లూరుకి వచ్చి నగరంలో ఒక కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లగా ఆమె వ్యాధి తీవ్రతనుబట్టి వారు చేర్చుకోనందున డి.ఎస్‌.ఆర్‌. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింద తెలిపారు. ఈమెకు మెరుగైన వైద్య అందించడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి చక్కబడి పూర్తిగా కోలుకుంద తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందిస్తున్నారనేందుకు ఈ కేసు ఉదాహరణగా లుస్తుందన్నారు. అనంతరం ఆసుపత్రి పరిపాలనా విభాగాన్ని సందర్శించి, ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌కు సంబంధించిన ధరఖాస్తులను పరిశీలించారు. సదరు ధరఖాస్తులను పెండింగులో వుంచిన జూయర్‌ అసిస్టెంట్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజులలోపు పెండింగులో వున్న అన్ని ధరఖాస్తులను పూర్తిచేయాల, సదరు జూనియర్‌ అసిస్టెంట్‌ పై చర్యలు తీసుకోవాలని ఆయన పరిపాలనాధికారిని ఆదేశించారు. తదుపరి ప్రత్యేక వార్డుల ఆధునీకరణ పనులను పరిశీలించి 20 రోజులలోపు పనులన్ని పూర్తిచేయాలని ఆయన ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సమన్వయ అధికారి డా. చెన్నయ్య, ఆర్‌.యం.ఓ. డా. జూలియాన, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా. పెంచలయ్య, డా. కృష్ణమూర్తి, డా. శ్రీధర్‌ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: