ఒకేరోజు 111 కేసుల్లో తీర్పులు


దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ఒకేరోజు 111 క్రిమినల్‌ కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు ఈ సంచలనానికి వేదిక అయింది. దేశ జ్యుడీషియల్‌ చరిత్రలో ఒకేరోజు 111 క్రిమినల్‌ కేసుల్లో తీర్పులు ఇచ్చిన జడ్జీగా జె.వి.వి.సత్యనారాయణమూర్తి రికార్డు సృష్టించారు. గతంలో మంగళగిరి కోర్టుల చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలుగులో తీర్పులనిచ్చి రికార్డు సృష్టించగా, నేడు ఒకేరోజు 111 క్రిమినల్‌ కేసులలో తీర్పులు వెల్లడించి న్యాయ వ్యవస్థ చరిత్రలో మరోసారి రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. వివిధ కేసులలో రు.99,500 జరిమానాలు విధించారు. దీంతోపాటు గత పార్లమెంటు ఎన్నికల్లో పోలీసులకు పట్టుబడ్డ రు.4.17 లక్షలను ఎవరూ క్లెయిమ్‌ చేయకపోవడంతో ఆ మొత్తాన్ని ప్రభుత్వ నిధికి జమ చేయడం నేటి తీర్పులలో విశేషం. ఉన్నత న్యాయస్థానంలో ఒకేరోజు సుమారు 80 కేసులలో తీర్పులనిచ్చిన సందర్భాలు వున్నా… గుంటూరుజిల్లా మంగళగిరిలోని అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఒకేరోజు ఇన్ని తీర్పులు వెలువడడం విశేషం. జడ్జి వి.వి.సత్యనారాయణమూర్తి విలక్షణ జడ్జిగా గుర్తింపు పొందారు. కొన్ని సంవత్సరాల క్రితం న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన సత్యనారాయణమూర్తి అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, అనంతరం పరీక్షలలో ఉత్తీర్ణులై సివిల్‌ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. పులివెందులలో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బాధ్యత స్వీకరించిన ఆయన కేవలం 20 రోజుల్లో 808 కేసుల్లో తీర్పులిచ్చి ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి నుండి ప్రశంసలు అందుకున్నారు. మూడు నెలల క్రితం మంగళగిరి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బాధ్యత స్వీకరించిన ఆయన అదే ఒరవడి సృష్టించారు. ఆయన కేవలం రెండు నెలల్లో సుమారు 600 కేసుల్లో తీర్పులు వెల్లడించారు. బుధవారం ఇచ్చిన తీర్పులలో 2004 నుండి 2010 వరకు గల కేసులు వుండటం గమనార్హం. నేటి కేసులలో దొంగతనం, కొట్లాట, భార్యాభర్తల తగాదాల కేసులు, యాక్సిడెంట్‌ కేసులు వున్నాయి. ప్రమాదాల కేసులలో, కొట్లాట కేసులలో చట్టపరిధిలో జరిమానాలు విధించి, కేసులు త్వరితగతిన విచారణ ముగించడానికి తీర్పులనిచ్చారు. గత పార్లమెంటు ఎన్నికలలో ఒక ప్రజాప్రతినిధి సొమ్ము 4 లక్షల 17 వేలు పోలీసులకు చేతికి చిక్కింది. ఆ కేసులో ప్రజాప్రతినిధితో సహా పదిమందిపై కేసు నమోదుచేశారు. విచారణ అనంతరం పోలీసులకు పట్టుబడ్డ 4 లక్షల 17వేలు తమదేనని ఎవరూ క్లెయిమ్‌ చేయలేదు. దీనితో జడ్జి ఆ సొమ్మును ప్రభుత్వ ఫండుకు జమ అయ్యేలా తీర్పునిచ్చారు. అలాగే వివిధ కేసుల్లో నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో జడ్జి రు.99,500 జరిమానా విధించారు. దేశ జ్యుడిషియల్‌ చరిత్రలో ఒకేరోజు 111 క్రిమినల్‌ కేసులలో తీర్పులిచ్చి రికార్డు సృష్టించిన జడ్జి సత్యనారాయణమూర్తిని స్థానిక బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు అభినందించారు. అత్యున్నత న్యాయస్థానంలో ఒకేరోజు సుమారు 80 కేసుల్లో న్యాయమూర్తులు తీర్పులిచ్చిన సందర్భాలున్నాయని, అయితే ఇన్ని కేసులలో మంగళగిరి కోర్టులో తీర్పులు రావడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వాకా రాంగోపాల్‌గౌడ్‌, ప్రత్తిపాటి నాగేశ్వరరావు, న్యాయవాదులు లంకా శివరాం ప్రసాద్‌, కె.శివారెడ్డి, ఉయ్యూరు బాపిరెడ్డి, వేమూరి రత్నప్రసాద్‌, కూరపాటి మురళిరాజు, సిహెచ్‌.ఐజయ్య, దొడ్డక బ్రహ్మం ఇంకా పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: