ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ


చిత్తూరు: మునిసిపల్‌ ప్రాంతాలలో వార్డులవారిగా ఇప్పటికే ప్రచురించిన వార్డులవారి ఓటర్ల జాబితాలలో మార్పులు, చేర్పులు, సవరణలపట్ల రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించి వారి పరిదిలో ప్రజలకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టరు వి.శేషాద్రి పిలుపు నిచ్చారు. గురువారం సాయంత్రం కలెక్టరు కార్యాలయంలో వార్డులవారి ఓటర్ల జాబీతాలపైన వివిధ రాజకీయ పార్టీలతో కలెక్టరు సమావేశమయ్యారు. మునిసిఫల్‌ ఎన్నికలకు నోటిపికేషన్‌ వచ్చునంతవరకు ఇప్పటికే ప్రచురించిన వార్డులవారి ఓటర్ల జాబితాలలో చేర్పులు, తొలగింపులు, సవరణలకు సంబందిత కైమ్‌లను ఎలక్ట్రోరల్‌ రిజిష్ట్రేషన్‌ ఆపీసర్లకు అనగా సంబందిత ఆర్డీఓలకు మరియు సంబందిత తహశిల్దారులకు సమర్పించాల్సి వుంటుందని కలెక్టరు పేర్కోన్నారు. ఈ నెల 13వ తేది జిల్లాలోని అన్ని మునిసపాలిటీలలో వార్డులవారి ఓటర్ల ముసాయిదా జాబీతాలను ప్రచురించడం జరిగిందని, జాబితాలు మునిసిఫల్‌ కార్యాలయాలు, తహశిల్దారు కార్యాలయాలు సంబందిత వార్డు పోలింగ్‌ బూతులైన పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద ఆయావార్డుల ఓటర్ల జాబితాలు అందుబాటులో వున్నాయని ప్రజలు ఈ జాబితాలను పరిశీలించుకోవచ్చునన్నారు. జాబితాలలో చేర్పుల నిమిత్తం ఫారం 6 పేర్లు తొలగించాల్సిన పక్షంలో ఫారం -7, సవరణల నిమిత్తం ఫారం – 8, ఒకవార్డు నుండి మరియెక వార్డునకు తమ పేర్లు మార్చుకోవాల్సివస్తే ఫారం-8ఎ లో వివరాలను అందించాల్సివుంటుందని, ఈ క్లెయిమ్స్‌ ను సంబందిత తహశిల్దారులు (అసిస్టెంట్‌ ఎలక్ట్రోరల్‌ ఆపీసర్ల) అందజేస్తే ఆర్డిఒలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. మునిసిఫల్‌ కమీషనర్లు మరియు సంబందిత తహాశిల్దారులు వారి పరిదిలోని రాజకీయ పార్టీల అధ్యక్షులతో వచ్చేవారం లోపల సమావేశాలు ఏర్పాటుచేసి ఒటర్ల జాబీతాలపట్ల అవగాహన కల్పించాలని కలెక్టరు మునిసిఫల్‌ కమీషనర్లను ఆదేశించారు. ఈ నెల 13వ తేది ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలలో చిత్తూరు మునిసిఫల్‌ పరిదిలో మొత్తం ఓటర్లు 110246 కాగా పురుషులు 55487, స్త్రీలు 54749, నగరి మునిసిఫల్‌ పరిదిలో 37226 కాగా పురుఘలు 18190, స్త్రీలు 19036, పుత్తూరులో మొత్తం 34477 ఓటర్లు కాగా, పురుషులు 16932, స్త్రీలు 17545, మదనపల్లి మునిసిపాలిటీలో మొత్తం 100520, పురుషులు 52255, స్త్రీలు 48265, పుంగనూరులో 32230 ఓటర్లుకాగా, పురుఘలు 15694, స్త్రీలు 16536, పలమనేరులో మొత్తం31286 ఓటర్లుకాగా పురుఘలు 15635, స్త్రీలు 15651, శ్రీకాళహస్తి మునిసిఫల్‌ పరిదిలో మొత్తం 53818 ఓటర్లు కాగా పురుఘలు 26660, స్త్రీలు 27158 ఓటర్లు వున్నారని వివరించారు. సమావేశంలో టి.డి.పి పార్టీ తరపున సురేంద్రకుమార్‌, సి.పి.యం. కె.సురేంద్రన్‌ , జనతాధల్‌ యం.యం.ఆలీ, బహుజన్‌ సమాజ్‌ వాధి డి.జయరాం, బి.జె.పి శివశంకర్‌, సి.పి.ఐ సుప్రియా చౌదరి హాజరయ్యారు. డి.ఆర్‌.ఒ యాదగిరి, చిత్తూరు ఆర్డీఒ సుబ్రమణ్యశ్వరరెడ్డి, మునిసిపల్‌ కమీషనర్లు, సంబందిత తహాశిల్దారులు సమావేశంలో పాల్గోన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: