హస్తిన వేదికగా సమాలోచనలు


న్యూఢిల్లీ: కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డికి చెక్‌ పెట్టేందుకు హస్తినలో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. వచ్చేనెల 3వ తేద నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను చేపట్టాలని జగన్‌వర్గం నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇరకాటంలో పడిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేయాలో పాలుపోక అధిష్ఠానం నుంచి స్పష్టమైన అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునే ప్రయత్నంగా ఢిల్లీ చేరుకున్నారు. వారు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, సోనియాకు సన్నిహితులు అహ్మద్‌ పటేల్‌తో భేటీ అయ్యారు. ఆయనతో సమావేశమైన వారిలో 8 మంది ఎమ్మెల్యేలు వున్నారు. అయితే ప్రకాశం జిల్లాలో ఓదార్పుయాత్రకు నాయకత్వం వహిస్తారని భావిస్తున్న జగన్‌ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు శివప్రసాద్‌రెడ్డిలు మాత్రం దూరంగా వున్నారు. ఢిల్లీ చేరుకున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముందుగా జిల్లాకు చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఇంట్లో సమావేశమై, సమాలోచనలు జరిపారు. మధ్యాహ్నం మరో మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పనబాక లక్ష్మితో సమావేశమయ్యారు. జగన్‌ ఓదార్పుయాత్ర అనివార్యంలా కన్పిస్తుండ టంతో దీనికి దూరంగా వుండేందుకు ముందుగానే అధిష్ఠానంతో సంప్రదించడం సరైన నిర్ణయం అవుతుందని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇందులో భాగంగానే ఈ చర్చలు, సంప్రదింపులు మొదలుపెట్టారు. ఓదార్పు యాత్రను ఎలాగైనా ఆపాలని వారు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలిసింది. కాగా రెండు రోజులుగా ఢిల్లీలో పలువురు పార్టీ పెద్దలతో మంతనాలు జరిపిన ప్రకాశం శాసనసభ్యులు నేటి రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. తాము కేవలం జగన్‌ను కలవటానికి మాత్రమే ఢిల్లీ వెళ్ళినట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రవికుమార్‌, మహీధరరెడ్డి విమానం దిగిన అనంతరం చెప్పారు. మరోవైపు జగన్‌ ఓదార్పుపై గురువారం ప్రకాశం ఎమ్మెల్యేలు అధికారిక ప్రకటన చేస్తారని ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి న్యూఢిల్లీలో చెప్పారు. ఇదిలావుండగా, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల మద్దతు పొందేందుకు జగన్‌ కూడా ఢిల్లీలోనే మకాం వేసి, ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్యేలతో సమావేశమై, సంప్రదింపులు జరిపారు. అయితే వారు అంత అనుకూలంగా స్పందించినట్లుగా లేదని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. సమయం వృథా చేయవద్దని, తోడ్పాటు ఇస్తారా లేదా తేల్చిచెప్పాలని జగన్‌ ఒకింత ఆవేశంగా అన్నట్లు తెలిసింది. కాగా, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ వై.ఎస్‌.వివేకానందరెడ్డి జులై 17న పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు తెలియజేశారు. లేఖ ప్రతి వివరాలు కూడా ఎలక్ట్రానిక్‌ మీడియాలో వెల్లడయ్యాయి. ఆయన నేరుగా సోనియాగాంధీకే ఈ లేఖ రాశారు. జగన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, మధ్యేమార్గంగా ఇటు ఓదార్పు యాత్రను కూడా కొనసాగించేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన పరోక్షంగా విజ్ఞప్తి చేశారు. ఇందిర కుటుంబానికి తమ కుటుంబం పూర్తిగా విధేయులుగా వున్నట్లు లేఖలో తెలిపారు. కష్టకాలంలో ఇందిరాగాంధీ తమ కుటుంబాన్ని ఆదుకున్నట్లు ఆయన ప్రస్తావించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: