స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ


మహబూబ్‌నగర్: పురపాలక సంఘ ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా సవరణకై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్‌ యం.పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుతో పాటు మార్పు చేర్పులకు అవకాశం వుందని అన్నారు. గురువారం ఆయన తన ఛాంబర్‌లో నాలుగవ సాధరణ పురపాలక సంఘ ఎన్నికల విషయమై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ నోటిఫికేషన్‌ ప్రకారం జనవరి 1, 2010 నాటికి 18 సంవత్సరాల వయస్సున్న వారు ఓటర్ల జాబితాలో పేర నమోదుకు నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి చనిపోయిన వారి పేర్లు శాస్వతంగా వలస వెళ్లినవారి పేర్లు తొలగించటంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఓటర్ల జాబితాలో ఎవైనా సమస్యలున్నట్లయితే సంబంధిత తహశిల్దారు లేదా ఆర్డిఓల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఫోటో లేనివారిని కూడా పరిశీలిస్తామని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లను విభజించవద్దని అన్ని ఒకే వార్డు కిందకు వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ కొన్ని మున్సిపల్‌ వార్డులలో ఓటర్లున్నప్పటికి పేర్లు తొలగించబడ్డాయని, ఫోటోలసేకరణ చేయలేదని, జాబితా పరిశీలనను బాధ్యత గల అధికారులకే అప్పగించాలని కోరారు. ఓకే కుటుంబానికి చెందిన ఓటర్లను రెండు వార్డులలో తీసుకోకుండా ఒకే వార్డులో వచ్చేలా చూడాలని, వార్డు హద్దున బట్టి జాబితా రుపొందించాలని కోరారు. శాస్వతంగా వలస వెళ్లిన ఒటర్ల జాబితాను తెప్పిస్తున్నామని, పోటోల సేకరణ విషయమై పలు మార్లు మున్సిపల్‌ వార్డులలో సమావేశాలు నిర్వహించటం జరిగిందని, ఒటర్ల జాబితా సవరణ సందర్బంగా అభ్యంతరాలు స్వీకరణతో పాటు, ఫోటోలు లేనివి కూడా పరిశీలన జరిపిస్తామని కలెక్టర్‌ తెలిపారు. జాబితాలో తప్పులు పరిశీలించుకునేందుకు ఇంకా అవకాశం వుందని అందువల్ల సరిచేయించే ఎర్పాటు చేస్తామని చెప్పారు. మున్సిపల్‌ చైర్మన్లు ఒబేదుల్లాకోత్వాల్‌, లక్ష్మయ్య, కాంగ్రేస్‌ పార్టీ తరపున రంగారావు, శంకరప్రసాద్‌, టిడిపి జిల్లా కోశాధికారి సురెందర్‌ రెడ్డి, సిపిఐ నుండి ఈర్ల నర్సింహ్మ, కురుమూర్తి, సిపిఎం తరపున, ఎంఐఎం తరపున నుండి హాది, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట ఆర్డిఓలు రాజేశం, జహీర్‌, హరిత, మున్సిపల్కకమీషనర్లు, బిఎస్పి నుండి రామచంద్రయ్య, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: