వీడియోగ్రాఫర్ల ప్రతిభకు గుర్తింపు


కర్నూలు: తాము చేస్తున్న వృత్తికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, తమను కూడా ప్రోత్సహించాలని, ప్రజలకు అందిస్తున్న సమాచారం వెనుక తాము పడుతున్న కష్టాలను గుర్తింపు ఉండాలని, తమకు కూడా వీడియోగ్రఫీ డేను నిర్వహించాలని పలువురు ఎలక్ట్రానిక్‌ మీడియా, ఫోటోగ్రాఫర్లు, పాత్రికేయులు జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. గురువారం ఉదయం పలువురు మీడియా ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసారు. చాలా కాలంగా వృత్తిపరంగా చేస్తున్నప్పటికి, తగిన గుర్తింపుతో పాటు ప్రజలకు మారుమూల ప్రాంతాలకు విస్తరించే ఎలక్ట్రానిక్‌ మీడియా తెలిసిన విషయమని, కాని తాము పడుతున్న కష్టాలను, నైపుణ్యంకు తగిన ప్రోత్సాహం కూడా కల్పించాలని వారు కోరారు. దీని పై కలెక్టర్‌ నాయక్‌ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు, విధులు మరువరానివ్వని, గత ఏడాది వరదలు లాంటి సమయంలో ఎంతో కష్టపడ్డారని ఆయన అభినందించారు. అదే విధంగా ప్రభుత్వ పథకాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఒక డాక్యుమెంటరీ తయారు చేసి ప్రజలకు అందిస్తే మరింత సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందని ఎలక్ట్రానిక్‌ వీడియోగ్రాఫర్‌ రామస్వామికి కలెక్టర్‌ తెలిపారు. కొంతమంది వీడియో, ఫోటోగ్రాఫర్లు వరదల్లో దెబ్బతిన్నారని,వారిని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారని, దీని పై పిడితో మాట్లాడి తగిన న్యాయంచేస్తానని కలెక్టర్‌ నాయక్‌ హామి ఇచ్చారు. రామస్వామితో పాటు రాష్ట్ర పతంజలి జర్నలిస్టుల సంఘం వ్యవస్దాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త, ఫోటోగ్రాఫర్లు ఆంజనేయులు, మధు, విజయ్‌కరణ్‌లు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: