నిరుద్యోగులకు స్వయం ఉపాధి రంగాన శిక్షణ


మహబూబ్ నగర్: సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యమని రాష్ట్ర చిన్న మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ మంత్రి డి.కె.అరుణ తెలిపారు. గురువారం ఆమె ఎంఎస్‌ఎంఇ సంస్థ ఆధ్వర్యంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఎర్పాటు చేసిన కంప్యూటర్‌ శిక్షణా కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎర్పాటు చేసిన ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయి శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫెకెట్లు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చిన్న పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి పూర్తి సహాకారం అందిస్తామన్నారు. చిన్న తరహా పరిశ్రమల కింద 50 వేల రుపాయల నుండి 5 కోట్ల రుపాయల వరకు పరిశ్రమలు పెట్టుకోవచ్చన్నారు. చిన్న చిన్న యూనిట్లు నెలకొల్పుకునే వారికి ఎంఎస్‌ఎంఇ తరపున పూర్తి సహాకారం అందిస్తామని, ముఖ్యంగా యూనిట్లు ఎలా స్థాపించుకోవాలి, బ్యాంకు రుణాల మంజురు,సబ్సిడి, మార్కెటింగ్‌, తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమంలో అభ్యర్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఇ శిక్షణలను జిల్లాలో కొనసాగించటమే కాక జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కూడా ఎర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిరుద్యోగులు అధికంగా వుండటం, నిరక్షరాస్యత ఎక్కువగా వుండటం వల్ల నిరుద్యోగ యువతకు మంచి శిక్షణనిస్తే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గద్వాలలో త్వరలోనే జ్యూట్‌ శిక్షణ ఎర్పాటు చేయనున్నామని, షాద్‌నగర్‌, గద్వాలల్లో బ్యూటిషియన్‌ థెరపి శిక్షణనిస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి ఉపాది గ్యారంటీ పథకం కింద పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నామని జిల్లాలో వెయి మందికి ఉపాధి కల్పిస్తున్నామని 3.72 కోట్ల రుపాయల సబ్సీడిని ఈ పథకం కింద ఇస్తున్నామని పెర్కోన్నారు. అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, పట్టుదలతో ముందుకెళ్లాలని, నిరాశకు గురికాకుండా కష్టపడి, పట్టుదలతో స్వంత యూనిట్లు ఎర్పాటు చేసుకోని పైకి రావాలని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కోత్వాల్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఎంఎస్‌ఎంఇ శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని, ముఖ్యంగా ఇవన్ని దేశ ప్రగతికి దోహదం చేస్తాయన్నారు. అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పరిశ్రమల కేంద్రం డిడి మదన్‌మోహన్‌ చెట్టి, కెవిఐబి సహాయ సంచాలకులు రాయప్ప, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ప్రకాష్‌తో పాటు శిక్షణ పొందిన కొందరు అభ్యర్థులు మాట్లాడారు. కేంద్ర ఎంఎస్‌ఎంఇ సంస్థ సహాయ సంచాలకులు కె.వి.చౌదరి సమావేశానికి అధ్యక్షత వహించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: