గ్రామీణ పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్


మహబూబ్‌నగర్‌, ఆగస్టు 19 (ఫీచర్స్ ఇండియా): ఈ నెల 30 నుండి వచ్చే నెల 15 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలలో పారిశుద్ద్యంపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ యం.పురుషోత్తంరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు గాను కార్యాచరణ ప్రణాళిక రుపొందించాలని, ఈ ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమంలో మురికి కాలువల శుభ్రం,తాగునీటి ట్యాంకుల శుభ్రంతో పాటు నళ్లా గుంతలను పూడ్చటం, తాగునీటి పైపులైన్ల లీకేజిలను అరికట్టటం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించటం, తాగునీటి పరీక్షలు నిర్వహించటం వంటివి చేపట్టాలని తెలిపారు. పారిశుద్ద్య ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమంలో అధికారులు ప్రతి గ్రామం వెల్లి పారిశుద్ద్య పరిస్థితి ఎలా వుందో బేరీజు వేయాలని అనంతరం కార్యాచరణ ప్రణాళిక రుపొందించాలని, ఎంపిడిఓ ఆధ్యర్యంలో అధికారులందరూ గ్రామాలు సందర్శించాలని ఆదేశించారు. ఆర్డిఓలు, ప్రత్యేకాధికారులు కూడా గ్రామాలు తిరిగి నివేదిక సమర్పించాలని కోరారు. అలాగే ఆర్‌డబ్ల్యుఎస్‌, పంచాయతి అధికారులు, సిబ్బంది, కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎంపిడిఓలు ప్రతిరోజు జడ్పి సిఇఒకు నివేదిక పంపాలని ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ద్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దని, లేదంటె కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షర భారత్‌ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 8 నుండి ప్రారంభిస్తున్న దృష్ట్యా తక్షణమె గ్రామ సమన్వయకర్తల జాబితా పంపాలని ఇంకా 188 గ్రామాల జాబితా రావలసి వుందని, సోమవారం నాటికి జాబితా పంపాలని ఎంపిడిఓలను ఆదెశించారు. అలాగే గ్రామాలలో అక్షర కేంద్రాలను గుర్తించాలని వాలంటీర్లను గుర్తించాలని, ఒక పొదుపు సంఘాన్ని ఒక అక్షర కేంద్రంగా చేస్తున్నందున లీడర్‌ను కూడా గుర్తించాలని ఈ మొత్తం కార్యక్రమాలు ఈ నెల 25 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సాక్షర భారత్‌ మొదటి విడతన జిల్లాలో లక్ష 10 వేల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇందిరమ్మ గృహా నిర్మాణాల పథకం కింద రెగ్యులర్‌గా మంజూరయిన ఇండ్లకు బిల్లుల చెల్లింపులో, సిమెంట్‌ జారీలో జాప్యం చేయవద్దని తెలిపారు. వివిధ పథకాల కింద లబ్దిదారుల ఎంపికకై నిర్వహించిన ఉమ్మడి గుర్తింపు శిభిరాలలో ఎంపిక చేసిన యూనిట్లకు సోమవారం లోగా బ్యాంకుల సమ్మతి పత్రాలు పంపాలన్నారు. ఉధ్యాన తోటల పెంపకానికై గుంతలు తీయటం, మొక్కలు నాటటానికి ఇది అనువైన సమయమైనందున ఎంపిడిఓలు మండలానికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఈ పథకం కింద సాధ్యమైనంత ఎక్కువ మంది కూలీలకు పని కల్పించాలని సూచించారు. అమ్రాబాద్‌ నుండి 29 వేల రుపాయలు, ధన్వాడ 49,500 రుపాయలు, హన్వాడ నుండి 15 వేల రుపాయల పైకా నిధులు రావలసి వుందని ఈ మండలాల ఎంపిడిఓలు శనివారం లోపు పంపాలని లేదంటే చర్య తీసుకుంటానని కలెక్టర్‌ హెచ్చరించారు. ఓటర్ల ఫోటో సేకరణపై కలెక్టర్‌ సమీక్షించగా, రేషన్‌ కార్డులు, పౌరసరఫరాలకు సంబంధించిన అంశాలపై జాయింట్‌ కలెక్టర్‌ టి.చిరంజీవులు తహశిల్దారులతో సెట్‌లో మాట్లాడారు. జిల్లా రెవిన్యూ అధికారి సుధాకర్‌ రావు, ఇతర అధికారులు ఈ సెట్‌ కాన్ఫరెన్సుకు హాజరయ్యారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: