కామన్‌ వెల్త్‌ క్రీడల పట్ల అవగాహన


తిరుపతి: కామన్‌ వెల్త్‌ క్రీడల‌ పట్ల ప్రజల్లో అవగాహన, క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు గాను తిరుపతి చేరుకున్న క్వీన్స్‌ బాటన్‌ రిలేకు ఘనస్వాగతం లభించింది. విజయవాడ పర్యటన పూర్తి చేసుకుని రాష్ట్రంలో చివరి పర్యటన లో భాగంగా తిరుపతికి రేణిగుంట రోడ్డులో గల మారుతి సుజకి పో రూం దగ్గర ఈ రిలేకు జిల్లా కలెక్టర్‌ వి.శేషాద్రి, యువజన సర్వీసుల శాఖ సంచాలకులు డా. జి . వాణిమోహన్‌ , ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అధారిటీ వైస్‌ ఛైర్మన్‌ మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ముఖేష్‌ కుమార్‌ మీనా, జిల్లా ఎస్‌.పి శ్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు జాతీయ,అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు తదితరులు ఘనస్వాగతం పలికారు. ముందుగా మారుతి సుజుకి షోరూం దగ్గర జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ శ్రీ జి. కృష్ణారెడ్డి క్వీన్స్‌ బాటన్‌ ను జిల్లా కలెక్టర్‌ కు అందించారు. ఏసియన్‌. సిల్వర్‌ మెడల్‌ గ్రహీత అథ్లెట్‌ శ్రీ జి. ఆంజనేయులు నాయుడు కు ఈ క్వీన్స్‌ బాటన్‌ ను కలెక్టర్‌ అందించి జెండా ఉపడంతో రిలే ప్రారంంభ##మైంది. ఆంజనేయులు నాయుడు దగ్గర నుండి డా. అంబేద్కర్‌ లా కాలేజి దగ్గర రంజీట్రోఫీ క్రికెట్‌ నందు పొల్గొన్న శ్రీ పి.ఆర్‌.మోహన్‌, బాటన్‌ ను అందుకున్నారు. శంకరం బాడి సర్కిల్‌ దగ్గర అథ్లెట్‌ రాజగోపాల్‌, యస్‌.జిి.యస్‌ కళాశాల వద్ద ఏ.సి.యన్‌ వెటరన్‌ అథ్లెట్‌ భాంపియన్‌ షిస్‌ లో పాల్గొన్న ఇ. రాజగోపాల్‌, ఐ.బి.పి పెట్రోల్‌ బంకు వద్ద ఆల్‌ ఇండియా ఉమన్‌ ఫెస్టివల్‌ లో బ్రాంజి బెడల్‌ గ్రాహీత అథ్లెట్‌ డి. పుప్పలత,గౌతం టాలెంట్‌ స్కూల్‌ వద్ద సీనియఆర్‌ నేషనల్‌, సిల్వర్‌ మెడల్‌ గ్రహీత టెక్యాండ్‌ క్రీడాకారుడు, శ్రీ యం . చంద్రశేఖర్‌, బాలాజీ సర్కిల్‌ వద్ద 2006 లో హైజంప్‌ లో గోల్డ్‌ మెడల్‌ గ్రహీత అథ్లెట్‌ బి. నీరజ బాటన్‌ అందుకుని మహతి ఆడిటోరియం వద్ద రషీద్‌ ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌ గోల్డ్‌ మెడల్‌ గ్రహీత, వాల్‌ బాల్‌ క్రీడాకారుడు శ్రీ యం . తులసిరెడ్డికి బాటన్‌ ను అందించడంతో ఈ రిలే కార్యక్రమం ముగిసింది. ఈ రిలే నందు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన 30 మంది క్రీడా కారులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన యన్‌.సి.సి క్యాంపులో ఉన్న విద్యార్థిని, విద్యార్థులు, కళాశాల విద్యార్థులు ప్రజలు, 20 వాహనాలు, 30 అధికారులు , దాదాపు 40 మంది సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే అక్టోబర్‌ మాసంలో ఢిల్లీలో జరుగనున్న కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ క్వీన్స్‌ బాటన్‌ రిలే 70 దేశాల్లో ప్రయాణించి ఈ నెల 14 వతేదీన మన రాష్ట్రానికి బాటన్‌ చేరుకుని 18 వ తేదిన తిరుపతి తో రాష్ట్ర పర్యటన ముగుస్తుంది. హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఈ బాటన్‌ పర్యటన సాగింది. అనంతరం మహతి ఆడిటోరియంలో రిలేనందు పాల్గొన్న జాతీయ,అంతర్జాతీయ అవార్డులు పొందిన 30 మంది క్రీడాకారులను అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ బాటన్‌ తిరుపతికి రావడం చాలా సంతోషకరమైనదన్నారు. ఢిల్లీలో జరుగనున్న ఈ కామన్‌ వెల్త్‌ క్రీడలను విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. యువజన సర్వీసుల శాఖ సంచాలకులు డా. జి. వాణి మోషన్‌ మాట్లాడుతూ తిరుపతి నందు ఈ రిలేను విజయవంతం చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రిలే నేటితో రాష్ట్ర పర్యటన ముగించుకుని రేపు చెన్నైకు వెళ్తుందని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిట్‌ వైస్‌.ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ఒ డైరెక్టర్‌ శ్రీ ముఖేష్‌ కుమార్‌ మీన, జిల్లా యస్‌.పి.శ్రీ రామకృష్ణ ప్రసింగించారు. అనంతరం సాంస్స్కతిక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ శ్రీమతి శారదదేవి, మున్సిపల్‌ కమీషనర్‌ శ్రీ మతి జానకి, రాష్ట్ర ఒలంపిక్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ మాచ్చారామలింగారెడ్డి, ఏఎస్‌ పి జగ్గారావు, డియస్‌.పి గంగరాజు తదితరులు పొల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: