ఇప్పట్లో బయటపడలేం : ఒబామా


వాషింగ్‌టన్‌, ఆగస్టు 19: అగ్రరాజ్యమైన అమెరికా ఆర్ధిక మాంద్యం నుంచి ఇప్పట్లో బయటపడలేదని, దానికి ఇంకా కొంత సమయం పడుతుందని, ఒకవేళ ఎవరైనా తొందరగా అభివృద్ధి చేస్తాం అని చెబితే అది కేవలం మీరు వేసే ఓటు కోసమేనని గ్రహించాలని ఎన్నికల ప్రచారంలో ఉన్న ఒబామా అన్నారు. ఓ వైపు అమెరికాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న నేపధ్యంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలు తిరిగి డెమోక్రాట్లను ఎన్నుకోవాలంటే ఒబామా మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుని సతమతమవుతున్న ప్రజలకు అనేక రకాలుగా నచ్చజెప్పి వాళ్లని ఆకట్టుకోవలసి ఉంటుంది. 2012లో రానున్న అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే దేశానికి తాను చేసిన సేవలను, అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను ప్రజలకు తెలియజెప్పి వారి మనసు దోచే ప్రయత్నంలో ఉన్నారు ఒబామా. ఈ దశలో భాగంగా డెమోక్రటిక్‌ సెనెటర్‌ పాటీ ముర్రేకు మద్దతునివ్వడంతో పాటు నవంబర్‌లో జరగనున్న ఎన్నికల నిధుల సేకరణ కోసం ఆయన సీటిల్‌లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ ‘నిజం ఏంటంటే మనం ఆర్ధిక మాంద్యం నుంచి బయటపడటానికి, అలాగే 80 లక్షల ఉద్యోగాలను తిరిగి తీసుకురావటానికి మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. వేరే విధంగా ఎవరైనా చెప్పారంటే అది మీ ఓట్ల కోసమేనని గుర్తించాలి’ అని వ్యాఖ్యానించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: