ఇపిఎఫ్‌ చట్ట సవరణ అవశ్యం


ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అండ్‌ మిసిలేనియస్‌ ప్రొవిజన్స్‌ యాక్ట్‌ (ఇపిఎఫ్‌- ఎంపియాక్ట్‌) 1952 ను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1952లో దీనిని రూపొందించిన సామాజిక ఆర్థిక చిత్రం ఇప్పుడు పూర్తిగా మారి పోవడంతో, దాని ఉద్దేశాలు, స్ఫూర్తి, ఆదర్శాలు, లక్ష్యాలు అన్నీ పూర్తిగా విఫలమై పోతున్నాయి. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత, సర్వీసునుండి రిటైరైన కార్మికులకు దీని ఉద్దేశాలు, ఏ మేరకు ఉపయోగపడగలవన్న దానిపై పెద్దసంఖ్యలో సమాచారాన్ని కోరుతూ లేఖలు పంపబడ్డాయి. ఆ సమయం అప్పుడే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయం సామాన్య ప్రజలు, అలాగే దేశ శ్రామిక ప్రజల సాధారణ అవసరాలు తీర్చడం అన్నది ప్రభుత్వం ముందున్న సవాలు. అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ దేశానికి మిశ్రమ ఆర్థిక విధానం పేరుతో మధ్యేవాద అభివృద్ధి పంథాను ప్రవేశపెట్టారు. దీనర్థం ప్రభుత్వరంగ సంస్థలతో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చేయడంతో పెద్దసంఖ్యలో భారీ పరిశ్రమలు/మౌలిక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. వాటిలో భారీ యంత్ర పరికరాలు, ఉక్కు, ఇనుము, విద్యుత్‌ పరికరాలు, ఎరువులు, ఔషధాలు, వంటి పరిశ్రమలున్నాయి. దేశంలోని బడా పారిశ్రామిక సంస్థలు ఈ పారిశ్రామికాభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. పెద్దసంఖ్యలో నూతన పారిశ్రామిక వాడలు వెలిశాయి.వేలసంఖ్యలో ప్రజలు గ్రామాలనుండి తమ మూలాలను, ఆస్తిపాస్తులను విడిచిపెట్టి కొత్తగా పుట్టుకొచ్చిన ఈ పట్టణాలకు తరలి వెళ్లారు.వారు పనిచేసే పరిశ్రమపై ఆధారపడటం కంటే వారికి మరింకేమీ లేదు.భారీ తయారీ ప్రక్రియవల్ల శ్రామిక శక్తి ఒక్కచోట, ఒక కప్పునీడన కేంద్రీకరణ చెందటం ప్రారంభమైంది. వారిని వారు సంఘటిత పరచు కున్నారు. ఉపాధి భద్రత, రిటైరైన తరువాత ప్రయోజనాలు, తమ సంఘానికి గుర్తింపు ఇతరత్రా ప్రయోజనాలను సాధించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇపిఎఫ్‌ అండ్‌ ఎంపి యాక్ట్‌ 1952, అటుతరువాత 1971లో కుటుంబ పెన్షన్‌ పథకం, 1976లో ఉద్యోగుల డిపాజిట్‌తో ముడిపడిన బీమాపథకం, 1995లో ఉద్యోగుల పెన్షన్‌ పథకం అమలులో కొచ్చాయి. ప్రస్తుతం, ఈ మొత్తం దృశ్యం మారిపోయింది. ఉరుకులు పరుగులతో ఆర్థికాభివృద్ధి జరుగుతోంది. తన సహజలక్షణం స్వభావంతో దానికి కార్మికుల పట్ల ఎటువంటి కనికరమూ లేదు. ఫలితాలనూ ఇవ్వటం లేదు. అది ప్రభుత్వ అణచివేత యంత్రాంగంతో ముందుకు సాగుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం, అటు తరువాత అనేక పోరాటాల ద్వారా సాధించుకొన్న ఉపాధి భద్రత, ఉపాధి శాశ్వతత్వం (పర్మినెన్సీ) కార్మిక సంక్షేమ చర్యలు, తదితర అనేక ఇతర ప్రయోజనాలపై ఇప్పుడు దాడి జరుగుతోంది. వాటిని లాక్కొంటు న్నారు. భారీ పరిశ్రమలు తమ పరిమాణాన్ని (సిబ్బంది పరిమాణాన్ని) తగ్గించుకుంటున్నాయి. రిట్రెంచ్‌మెంట్ల ద్వారా, విఆర్‌ఎస్‌ ద్వారా, సిఆర్‌ఎస్‌ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా కార్మికులను బయటకు వెళ్లగొడుతున్నారు. సర్వీసునుండి రిటైర్‌మెంటు అన్నది ఇప్పుడొక కలగా మారింది. వాణిజ్యం పేరుతో పిలువబడే ఒక నూతన వ్యాపార ధోరణి అమలులోకి వచ్చింది. అది వస్తు తయారీ యూనిట్లను లేకుండా చేస్తోంది. అది దిగుమతి చేసుకోవడం ద్వారా బయటకు కాంట్రాక్టు ఇవ్వటం ద్వారా, ఔట్‌సోర్సింగ్‌ ద్వారా తయారైన వస్తువులను తెచ్చుకుంటోంది. యజమానులు లేదా కాంట్రాక్టర్‌ దొంగపేర్లతో 3-4 విడివిడి ప్రావిడెంట్‌ఫండ్‌ కోడ్‌నంబర్లు సంపాదించుకుంటారు. సాధారణంగా ఒక కార్మికుడి పారిశ్రామిక జీవితం మూడు మాసాలు. అతను ఏటా మూడు, నాలుగు సార్లు వేరువేరు పేర్లతో నియమించబడతాడు. ప్రభుత్వ సరళీకరణ విధానాల కారణంగా, అనుచిత చర్యలు, కార్మికచట్టాలను అమలు పరచకపోవడం విపరీతంగా పెరిగిపోయాయి. కార్మికులపేర్లు మస్టర్‌రోల్స్‌లో నమోదు కావటం లేదు. ఆ విధంగా చట్టప్రకారం వారికి రావలసిన ప్రయోజనాలేవీ వారికి దక్కటం లేదు. కార్మికుల వేతనాలనుండి తగ్గించిన ప్రావిడెంట్‌ఫండ్‌ కంట్రిబ్యూషన్‌లు అక్కౌంట్‌లో డిపాజిట్‌ చేయకపోవడం, ప్రావిడెంట్‌ ఫండ్‌ చట్ట నిబంధనలు అమలు పరచకపోవడం గణనీయంగా పెరిగిపోతున్నాయి. మరోవైపున, పైన పేర్కొన్న కార్మిక వ్యతిరేక విధానాల కారణంగా, ఇపిఎఫ్‌ చట్టం కింద వున్న నెలకు రు.6,500 ల వరకు గల వేతన పరిమితిని మే,2001 నుండి పెంచలేదు. కాగా, వివిధ రాష్ట్రాల్లో కనీస వేతనాలు నెలకు రు.4000లు, రు.5000లుగా పెరిగాయి. అకౌంట్లలో నిల్వ ఉన్న మొత్తాలపై చెల్లించే వడ్డీరేటు ఏడాదికి 12శాతం నుండి 8.5శాతానికి తగ్గించారు. ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీంలో పెన్షన్‌ లెక్కించేందుకు మల్టిప్లయింగ్‌ ఫ్యాక్టర్స్‌ను కేంద్రప్రభుత్వం తగ్గించివేసింది.ఆ విధంగా కార్మికులు పొందే నెలవారీ పెన్షన్‌లో ఇంతకుముందు పొందే పెన్షన్‌ కంటే రు.120-150లు తగ్గిపోతోంది. పెన్షన్‌ కమ్యూటేషన్‌ సౌకర్యం, ఇపిఎఫ్‌ 1995, ఉప నిబంధన 12ఎ, 13 ప్రకారం కమ్యూటేషన్‌ మొత్తాన్ని తిరిగి పెన్షన్‌లో కలిపి వేయడాన్ని 2008లో ఒక ప్రకటన ద్వారా ఉపసంహరించ బడ్డాయి. వీటివల్ల కార్మికులకు భారీనష్టాలు వాటిల్లు తున్నాయి. 2001 నుండి పెన్షన్‌ మూల్యాంకనం (వాల్యుయేషన్‌ ) జరగటంలేదు. కానీ, వినిమయ/ తినే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 1995 నాటితో పోలిస్తే వినిమయ ధరల సూచీ 400శాతం పెరిగిపోయింది. భారీ ద్రవ్యోల్బణం కారణంగా ఖాతాదారుల ఖాతాలలో వున్న మొత్తాలు వినియోగమార్కెట్లో తమ విలువను కోల్పోయాయి. 58ఏళ్ళలోపునే తగ్గించిన పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే కార్మికులకు గతంలోని ఏడాదికి మూడు శాతం తగ్గింపును నాలుగు శాతానికి కేంద్రప్రభుత్వం పెంచింది. ఇక్కడో విషయాన్ని గుర్తించాల్సి ఉంది. 45కోట్ల ప్రైవేటురంగ ఉద్యోగులకు తప్ప పెన్షన్‌ కొరకు వేతనాలపై ఎటువంటి పరిమితీ లేదు. ఇతర రంగాల ఉద్యోగులు తమ మొత్తం పెరిగిన వేతనాలపై, ఎటువంటి పరిమితీ లేకుండా, పెన్షన్‌ సౌకర్యాన్ని అనుభవిస్తున్నారు. మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే, అనేక రాష్ట్రాల్లో వితంతువులకు, సామాన్య ప్రజలలో వయోవృద్దులకిచ్చే పెన్షన్‌, ఎటువంటి కంట్రిబ్యూషన్‌ చెల్లించాల్సిన అవసరం లేకుండా, నెలకు రు. 700లు చెల్లిస్తున్నారు. కాగా, పెద్దసంఖ్యలో రిటైరైన కార్మికులు, పెన్షన్‌ నిధికి తమ వాటా చెల్లించిన తరువాత, నెలకు రు. 200ల నుండి 400ల వరకు పొందుతున్నారు. ప్రభుత్వోద్యోగుల పెన్షన్‌, వినిమయ ధరల సూచీతో అనుసంధించబడింది. ఆ విధంగా వారు ఎప్పటి కప్పుడు పెరిగిన పెన్షన్‌ మొత్తాన్ని పొందుతున్నారు. ఆరవ వేతన సంఘ సిఫారసులపై నిర్ణయాలను అమలు జరిపిన తరువాత ప్రభుత్వోద్యోగుల పెన్షన్‌కు, ప్రైవేటురంగ ఉద్యోగుల పెన్షన్‌కు గల వ్యత్యాసం అనేక రెట్లు పెరిగిపోయింది. 45కోట్ల ప్రైవేటురంగ కార్మికులు, ప్రభుత్వం తమను వంచించిందని వాపోతున్నారు. చట్టంలోని వివిధ నిబంధనలకు అవసరమైన ఈ దిగువ తెలియజేసిన సవరణలకు ఇవీ కారణాలు :
1. యజమాని- సేవకుడు సంబంధాలు ఉండే ఏ సంస్థలోనైనా పనిచేసే కార్మికులను/ఉద్యోగులను అందరినీ ఈ చట్టపరిధిలోకి తీసుకురావాలి. పది లేక ఇరవైమంది కార్మికులు/ఉద్యోగులు, విద్యుత్‌తో/విద్యుత్‌ లేకుండా అన్న ఉపనిబంధనలను తొలగించాలి. ఈ చట్టం కింద షాపులను కూడా చేర్చాలి.
2. గతంలో చేసినట్లుగా కాంట్రాక్టర్లకు విడిగా పిఎఫ్‌ కోడ్‌ నెంబరు కేటాయించకూడదు. ప్రధాన యజమానికే ఒక ప్రత్యేక సబ్‌ పిఎఫ్‌కోడ్‌ నెంబరు కేటాయించవచ్చును. అదే విధంగా ఆయా ప్రాంతీయ పిఎఫ్‌ కార్యాలయాలకు కంట్రిబ్యూషన్‌ లను వసూలు చేసి, జమ చేయడంలో ప్రధాన యజమానిని బాధ్యునిగా చేయాలి.
3.ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే కనీస వేతనాలను మూలవేతనంగా పరిగణించాలి.
కంట్రిబ్యూషన్‌ వసూలును పరిగణనలోకి తీసుకునేటప్పుడు చట్టం కింద నిర్వచించిన వేతనాలను విడగొట్టకూడదు.
4. (ఎ) వేతనం నుండి వసూలు చేసిన పిఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ను డిపాజిట్‌ చేయకపోవడాన్ని నేరస్థ చర్యగా పరిగణించాలి. భారత శిక్షాస్మృతిలోని నమ్మకద్రోహం కిందికి వస్తుంది కాబట్టి చట్టంలోని 406 సెక్షన్‌ను ఇతర సెక్షన్లను వర్తింపజేయాలి.
(బి) బాధిత ఉద్యోగి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా పిఎఫ్‌ను జమచేయకుండా ఎగవేసిన వారిపై క్రిమినల్‌ కేసు బుక్‌చేయాలి. అలాగే ప్రాంతీయ పిఎఫ్‌ కార్యాలయాలకు, ఎగవేత దారులతో వ్యవహరించేందుకు మరిన్ని అధికా రాలివ్వాలి. వారిని పూర్తిగా బాధ్యులను చేయాలి.
5. వ్యక్తుల ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాను పారదర్శకంగా నిర్వహించాలనే నిబంధనను చట్టంలో పొందుపరచాలి. ఆ విధంగా ఒక చందాదారుడు తన ఖాతాలో జమ అయిన డిపాజిట్ల గురించి బ్యాంకులలో జరుగుతున్నట్లుగా ఏ సమయంలోనైనా సరియైన సమాచారం పొందేందుకు వీలుంటుంది.
6. ఎ) చందాదారుని అభీష్టం మేరకు సంబంధిత యజమాని అనుమతిపై తిరిగి చెల్లించే రుణ అవకాశానికి చట్టంలో ఏర్పాటు కల్పించాలి. ఆ విధంగా తీసుకునే రుణాన్ని నెలసరి వాయిదాలలో చట్టబద్ధమైనరేటుకు ఒకశాతం అదనపు వడ్డీతో, వేతనం నుండి తగ్గించేందుకు వీలు కల్పించాలి.
బి) అనారోగ్యం యితరత్రా కారణాలకు ప్రస్తుతమున్న మూడు మాసాల వేతనంతో సమానమైన మొత్తానికి బదులు ఆరు మాసాల వేతనానికి సమానమైన మొత్తాన్ని రుణంగా యివ్వాలి.
సి) వివాహం యితరత్రా కారణాలపై యిచ్చే రుణాన్ని 6 మాసాలకు బదులు 12 మాసాల వేతన మొత్తాన్ని రుణంగా ఇవ్వాలి. ఉద్యోగుల డిపాజిట్‌తో అనుసంధించబడిన బీమా పథకం
1. ఈ స్కీం కింద బీమా మొత్తాన్ని చెల్లించాలంటే మరణానికి ముందు మూడు మాసాల సర్వీసు ఉండాలనే నిబంధనను తొలగించాలి. యజమాని-సేవకుడు సంబంధంపైనే చెల్లించాలి.
2. ఈ స్కీం కింద కనిష్ట మొత్తం రు. 1లక్షగాను, గరిష్ట మొత్తం రు. 3లక్షలుగాను ఉండాలి. ఇపిఎఫ్‌ స్కీం, 1995
1. ఇప్పటికే పెన్షన్‌ పొందుతున్న వారికి, ధరల సూచీలో పెరుగుదలను పరిగణనలోనికి తీసుకొంటూ, ప్రభుత్వోద్యోగులు, తదితరులపై 6వ వేతన సంఘ సిఫారసుల ప్రభావాన్ని సరిపోల్చుతూ,100 శాతం తాత్కాలిక పెంపుదల కల్పించాలి.
2. పైన పేర్కొన్న 1వ అంశాన్ని అమలు జరిపిన తరువాత, పెన్షన్‌ను వినిమయధరల సూచీతో అనుసంధానం చేస్తూ 6మాసాలకోసారి పెన్షన్‌ సవరిస్తూ ఉండాలి.
3. వేతనాలపై ఎటువంటి పరిమితి ఉండరాదు. నెలకు రు. 6,500ల వేతన పరిమితిని తొలగించాలి.
4. పెన్షన్‌ లెక్కించే అవసరమైన సర్వీస్‌ నిర్ణయించేందుకు ఈ క్రింది విధంగా సంవత్సరాల వెయిటేజ్‌ కల్పించాలి.
ఎ) 10సం||ల సర్వీసు తరువాత 1 ఏడాది
బి) 15 సం||ల సర్వీసు తరువాత రెండేళ్ళు
సి) 20 సం||ల సర్వీసు తరువాత మూడేళ్ళు
డి) 25 సం||ల సర్వీసు తరువాత నాలుగేళ్ళు
ఇ) 30 సం||ల సర్వీసు తరువాత ఐదేళ్ళు
ఎఫ్‌) 35 సం||ల సర్వీసు తరువాత ఆరేళ్ళు
5. ఒక ప్రకటన ద్వారా 10.06.2008 నుండి తగ్గించిన పాత పెన్షన్‌ లెక్కించేందుకు టేబుల్‌ బిలో సూచించిన హెచ్చవేయు కారణాంకాలను, పునరుద్ధరించాలి.
6. 58 ఏళ్ళకు ముందే రిటైరైన వారికి పెన్షన్‌ లెక్కించేందుకు తగ్గిన ప్రతీ ఏడాది సర్వీసుకు 4 శాతం చొప్పున తగ్గింపు ఉండకూడదు. ఎందుకంటే తగ్గించిన పెన్షన్‌ లెక్కకట్టేటప్పుడు పూర్వపు సర్వీసులోగాని, పెన్షనబుల్‌ సర్వీసులోగాని 58 ఏళ్ళ వరకు వెయిటేజ్‌ ఇవ్వటం లేదు.
7. ఇపిఎఫ్‌ నిబంధన 12 ఎ ను (కమ్యూటేషన్‌ కొరకు ఆప్షన్‌) జిఎస్‌ఆర్‌ (ఇ)-26.9.2008 ద్వారా తొలగించారు. దానిని పునరుద్ధరించాలి.
8. పైన 7లో పేర్కొన్న నోటిఫికేషన్‌ ప్రకారం తొలగించిన నిబంధన 13ను కూడా పునరుద్ధరించాలి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: