అదనంగా 10 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా


ఖమ్మం: జిల్లాకు అదనంగా 10 వేల మెట్రిక్‌ టన్నుల డి.ఎ.పి. 5 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌.యన్‌.నాగేశ్వరరావు ప్రభుత్వాని కోరారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య వీడియో కాన్పరెన్స్‌ ద్వారా, జిల్లా కలెక్టర్లతో వ్యవసాయం, సీజనల్‌ వ్యాధులు, తాగునీటి సరఫరా పారిశుద్ద్యం జాతీయ గ్రామీణ ఉపాది పనులపై మంత్రులు రఘవీరా రెడ్డి, జ్ఞానం నాగేందర్‌, బోత్ససత్యనారాయణ, వట్టి వసంతకుమార్లతో కలసి సచివాలయం నుండి సమీక్షించారు. ఈ సందర్బముగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలొ ఎరువుల కొరతలేదని ఈ సంవత్సరం రాష్ట్రంలొ విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో నీరు సమృద్దిగా చెరిందని ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ శాఖలతో సమిక్షించి సమగ్ర ప్రణాళికను రూపొందించుకొవాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి సూచించారు రైతులకు అవసరమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు సరఫరా చేస్తె రైతులకు మంచి పంట అందుతుందన్నారు. నిర్దేశించిన ధరకంటే అదిక ధరలకు ఎరువులు విక్రయించిన వారిపై చట్టపరంగా చర్యతీసుకొవాలని . జిల్లా స్థాయిలో విజిలెన్స్‌ పోలీసుశాఖల సహకారంతో అదిక దరలకు ఎరువుల విక్రయాన్నిఅరికట్టాలని, బాద్యులపై చట్టపరంగా చర్యలు తీసుకొవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. అదే విదంగా ఈ సంవత్సరం ఖరీఫ్‌కు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 17 వేల 400 కోట్ల రుణాల లక్ష్యానికిగాను 9 వేల 200 కోట్లు ఇప్పటికి అందించామని (53 శాతం) అయన తెలిపారు. ఈ అర్దిక సంవతసరంలొ నిర్దేశించిన ఋణాల ్యలను సాధించడానికి రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో మాట్లడడం జరిగిందని, ఈ సారి రైతులతోపాటు కౌలు రైతులకు కూడా ఋణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు అంగీకరించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.కౌలు రైతులకు ఋణాలు అందించడంలో జిల్లాకలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని అయన కొరారు. అదే విదంగా 12వ అర్దిక సంఘం నిధుల కింద జిల్లాకు జాతీయ అరొగ్య పదకం కింద కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించుకొని గ్రామాలలో పారిశుధ్య పనులను చేపట్టాలన్నారు. వర్షాకాలంలో గ్రామాలలొ అంటువ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కలుషితమైన తాగునీటి వల్ల డయోరియా వ్యాపించే ప్రమాదముందని పరిశ్రుభమైన నీటిని ప్రజలకు అందించాలన్నారు. గ్రామాలలొ పట్టణాలలొ పారిశుద్ద్య పనులు చేపటుటకుగాను అగష్టు 30 నుండి సెప్టెంబరు15 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ చెపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జాతీయ గ్రామిణ ఉపాది హామీ పథకం కింద చెపట్టే పనులకు గ్రామపంచాయితీ తీర్మానం తప్పనిసరిగా తీసుకొవాలని, ఎస్సీ, ఎస్టీ వర్గాల భూముల అబివృద్దికి మొదటి ప్రాదన్యత కల్పించాలన్నారు వీడియెకాన్పరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యన్‌.నాగేశ్వరరావు జిల్లాలో ఎరువులు విత్తనాల సరఫరా గురించి వివరిస్తూ జిల్లాకు అదనంగా 10 వేల మేట్రిక్‌ టన్నుల డిఎపి, 5 వేల మేట్రిక్‌ టన్నుల యూరియా అవసరముందన్నారు. అదేవిదంగా జిల్లాలో ఎజెన్సీ ప్రాంతంలొ వైద్య అదికారుల పొస్టులు ఖాళిగా వున్నాయని వాటిని భర్తీ కోసం కోరారు. అగష్టు 30 నుండి సెప్టెంబరు 15 వరకు చెపట్టనున్న స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటుచేసి గ్రామ, పట్టణాలలో పారిశుద్ద్య పనులు చేపట్టడానికి అవసరమైన పనులు గుర్తించి వాటికి కావలసిన నిధులకు సంబందించిన నివేదికను రూపొందించడానికి తగుచర్యలు చేపడ్తామని కలెక్టర్‌ తెలిపారు. వీడియో కాన్పరెన్స్‌లో ముఖ్య ప్రణాళికాధికారి వి.రంగారావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.హేమ మహేశ్వరరావు, జిల్లా వైద్య అరొగ్యశాఖాధికారి డాక్టర్‌ విష్ణుమోహన్‌ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ రామారావు, గ్రామీణ నీటి సరఫరా సూపరింటెండెంగు ఇంజనీరు వీరప్రతాప్‌, జిల్లా పంచాయితీ అదికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: