స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు


కాకినాడ: 15వ తేదీ ఉదయం 9 గంటలకు కాకినాడ జిల్లా పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో 64వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఎం.రవిచంద్ర వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణగావిస్తారని ఆయన తెలిపారు. అనంతరం 9.10 గంటలకు పోలీస్‌, ఎన్‌.సి.సి., స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థినీ విద్యార్థులచే సాంప్రదాయ కవాతు నిర్వహింపబడుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. తదుపరి 9.20 గంటలకు జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ది సంక్షేమ పధకాల గురించి మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులచే దేశభక్తి, జాతీయ సమైఖ్యతలకు సంబంధించి పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎం.రవిచంద్ర పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ నలంద విద్యానికేతన్‌ విద్యార్థులచే భారతమాత… భగద్గీత అనే నృత్య ప్రదర్శన, ఆదిత్య శ్రీనగర్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థినీ విద్యార్థులచే దేశా… రంగేలా అనే దేశభక్తి పూరిత గేయం, ఉమా మనో వికాస కేంద్రం విద్యార్థులచే బాలలం… మేము అనే ప్రదర్శన నిర్వహింపబడుతుందన్నారు. అలాగే కాకినాడ సి.బి.యం. స్కూల్‌ విద్యార్థులచే హిందూ దేశ్‌కా… నివాసి, జగన్నాయక్‌పూర్‌ ఆదిత్య పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులచే జాగోరే… జాగోరే…, నారాయణ కాన్సెప్ట్‌ స్కూల్‌ విద్యార్థులచే అందుకో పిలుపు అనే నృత్య ప్రదర్శన నిర్వహింపబడుతుందన్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్‌, ఎ.పి.ఐ.ఐ.సి., డి.సి.సి.బి., డి.సి.ఎం.ఎస్‌., జిల్లా గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు, వివిధ స్వచ్ఛంధ సేవా సంస్థల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: