వినియోగదారుల ఉద్యమంలో భాగస్వామ్యం


విశాఖపట్నం: వినియోగదారుల ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్‌ జె. శ్యామలరావు పేర్కొన్నారు. శనివారం ఆంధ్రా యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ అతిథి గృహంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న వినియోగదారుల రక్షణ మరియు సంక్షేమంపై ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సెమినార్‌కు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులుగా ప్రతి వ్యక్తి మోసపోకుండా ఉండడానికి అందరూ ఐక మత్యంతో పోరాడి విజయం సాధించాలని పేర్కొన్నారు. సగం జనాభా నిరక్షరాస్యలైనప్పటికి విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ పరంగా కొన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జనరిక్‌ మందులు తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. వినియోగదారుల ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనేలా చేయడానికి స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. సెల్‌ఫోన్‌లలో వస్తున్న ఇబ్బందికర మెస్సేజ్‌లను నివారించాలని చెప్పారు. కొన్ని కంపెనీలు అసత్యాలను ప్రచారం చేయకుండా మీడియా తగిన పాత్ర వహించాలని కోరారు. ఈ సెమినార్‌ ఏర్పాటు చేసిన ఆంధ్రాయూనివర్సిటీ లా కాలేజిని ఆయన అభినందించారు. మరోముఖ్య అతిధిగా పాల్గొన్న ఆంధ్రాయూనివర్సిటీ ఉప కులపతి బీలా సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖపట్నంలో వినియోగ దారుల క్లబ్‌లను ఏర్పాటు చేసి సమస్యలను నిజాయితీగా పరిష్కరించడానికి వీలుంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు దేవుళ్లు అంటూ ప్రచారం చేస్తున్న కంపెనీలు పది రూపాయల వస్తువును రెండు వందల రూపాయలకు అమ్మజూపే పెడదోరణిని నివారించాలన్నారు. ఉద్యోగులు తీసుకుంటున్న జీతానికి తగిన న్యాయంచేసిన నాడే విద్యార్థులకు, సమాజానికి మేలు జరుగుతుందన్నారు. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ సెమీనార్‌ విజయవంతమవ్వాలని ఆయన కోరారు. ఈ సెమినార్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, న్యూఢిల్లీ నుండి వచ్చిన ప్రొఫెసర్‌ సురేష్‌ మిశ్రా, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు-2 ఎన్‌. సరోజిని నాయుడు, డా. బి.ఆర్‌. అంబేథ్కర్‌ లా కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొ. ఎ. రాజేంద్ర ప్రసాద్‌, సెమినార్‌ డైరక్టర్‌ ప్రొ. ఎ. సుబ్రహ్మణ్యం, తదితరులు మాట్లాడారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌ జె. శ్యామలరావు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వందకు పై పరిశోధనా వ్యాసాలు అందిన దృష్ట్యా వాటిని సావనీర్‌గా ముద్రించిన బుక్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్లు, వినియోగదారుల సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: