గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు


విజయనగరం: గ్రామాలలో పారిశుద్ద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వీధులు, కొళాయిగట్లు, బావిగట్లు, బోర్లు, తదితర ప్రాంతాలన్ని పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టరు యం .వీరబ్రహ్మయ్య పంచాయితీ సెక్రటరీలు, సర్పంచ్‌లను ఆదేశించారు. శనివారం కలక్టరు డెంకాడ, పూసాపాటిరేగ మండలాలలో పలు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కలక్టరు వీధులలో తిరిగి పరిశీలించారు. డెంకాడ మండలం నాతవలస గ్రామంలో పారిశుద్ద్యానికి ఇంకా శ్రద్దవహించి మెరుగు పరచాలన్నారు. అపరిశుభ్రత వలనే గ్రామస్తులు రోగాల బారిన పడతారన్నారు. వీధులలో బ్లీచింగు చల్లడము, నీటిట్యాంకులను విధిగా క్లోరినేషను గావించడం చేయాలన్నారు. గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై ఎ.ఎన్‌.యం.ను కలక్టరు ప్రశ్నించారు. ఇమ్యునైజేషన్‌ కార్యక్రమము ఎలా జరుగుతోందని అడిగారు. ఈ సందర్భంగా కలక్టరు ఎలిమెంటరీ స్కూలును పరిశీలించారు. పిల్లల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఎంతమంది పిల్లలకు వండారని అడిగారు. గ్రామంలో 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరూ తప్పక బడికి పోయేందుకు గ్రామంలో ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. అదే గ్రామంలో అంగన్‌ వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలకు ఉదయం ఆహారం ఏమి యిచ్చారని ప్రశ్నించారు. ఉదయం కిచిడి పెడ్టడం జరిగిందని గుడ్డు కూడా యిచ్చామని నిర్వాహకురాలు డి. దేవి తెలిపారు. అనంతరం కలక్టరు పూసపాటిరేగ మండలం పసుపాం గ్రామంలో కలయ తిరిగారు. గ్రామంలో అపరిశుభ్ర వాతావరాణాన్ని గమనించిన కలక్టరు యం.పి.డి.ఓ. వచ్చి పోవడం కాదని దగ్గరుండి ప్రతి పని జరిపించాలని ఆదేశించారు. ఎక్కడ చూసిన చెత్త కనపడుతుంటే యిప్పటివరకు ఏమి చేశారని సర్పంచ్‌ని ప్రశ్నించారు. సర్పంచులు సరిగా స్పందించి పారిశుద్ద్య కార్యక్రమాలు నిర్వహించకపోతే నోటీసులు యివ్వాలని డి.పి.ఓ.ను ఆదేశించారు. తరువాత కలక్టరు కొళ్లాయివలస గ్రామంలో పర్యటించారు. ఒక గ్రామస్తుడు రోగంతో మంచంపై పడకోవడాన్ని గమనించిన కలక్టరు దగ్గరకు వెళ్లి ఏం పడుకున్నావని ప్రశ్నించారు. జ్వరం వచ్చిందని చెప్పగా వెంటనే డాక్టరును పరిశీంచమన్నారు. డాక్టరు పి. వెంకటరామారావు పరిశీలించి వైరల్‌ ఫీవరు అని చెప్పి మందులను యిచ్చారు. గ్రామంలో ఇంకా ఎంతమందికి జ్వరాలున్నాయని కలక్టరు ప్రశ్నించారు మొత్తం 5 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు డాక్టరు తెలిపారు. స్కుళ్లు, హాస్టళ్లు అన్నింటిలోను విద్యార్థులను పరిశీలించడం జరుగుతోందని డాక్టరు వివరించారు. అనంతరం కలక్టరు మాట్లాడుతూ నిధుల సమస్య లేదని సర్పంచులు స్థానికంగా అవసరమైన పారిశుద్ద్య పనులు ఎప్పటికప్పుడు పూర్తిచేసి బిల్లులు డ్రా చేసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఢిల్లీరావు, జిల్లా పరిషత్‌ సి.ఇ.ఓ. కొండయ్మ శాస్త్రి, జిల్లా పంచాయితీ అధికారి, యం .పి.డి.ఓ.లు, డి.లక్ష్మీ, భద్రమ్మ, తహసీల్దారు అపురసుందరి, పంచాయితీ సెక్రటరీలు, సర్పంచులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: