శ్రీకృష్ణ కమిటీ కడప జిల్లా పర్యటన


కడప: ఈ నెల 18 వతేదిన జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటి జిల్లాలో పర్యటిస్తున్నందున అన్నీ ఏర్పాట్లు సిద్దం చేయాలని జిల్లా కలెక్టరు శశిభూషన్‌ కుమార్‌ అదికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరు తన చాంబరులో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రాక సందర్బంగాచేయవలసిన ఏర్పాట్లపై జిల్లా అదికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సం ప్రదింపుల కమిటి (సిసియస్‌ ఏ సి) చైర్మన్‌ జస్టీస్‌ బియన్‌ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటి సభ్యులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ అదికారులు ఈ నెల 17 వ తేది రాత్రి షాద్నగర్‌ నుండి వెంకటాద్రి ఏక్స్‌ ప్రెస్‌ లో బయలుదేరి 18 వతేది ఉదయం 4-40 గంటలకు కడప నగరంలోని రాష్ట్ర అతిది గృ హానికి చేరుకుంటారన్నారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటలవరకు జిల్లాలోని రెండు గ్రామాలను సందర్శీస్తారని, 11 నుండి 11-15 గంటల వరకు రాష్ట్ర అతిది గృహంలో సీనియర్‌ఒ అదికారులతో సమావేశం నిర్వహిస్తారని, 11-30 నుండి మద్యా హ్నం 1 గంట వరకు వివిధ రాజకీయ పార్టీల, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారన్నారు. తదుపరి 2 గంటలవరకు విశ్రాంతి తీసుకుని కడప నుండి బయలుదేరి అనంతపురం జిల్లాకు వెళతారన్నారు. ఈ కమిటిలో చైర్మన్తో స హా సభ్య కార్యదర్శిగా వి కె దుగ్గళ్‌,సభ్యులుగా ప్రొఫెసర్‌ రణ బీర్‌ సింగ్‌,డా .రవీందర్‌ కౌర్‌ ,కేంద్ర హాంశాఖ, అంతర రాష్ట్ర మండలి ప్రత్యేక కార్యదర్శి సలహాదారుడు శశిప్రకాష్‌, సీనియర్‌ఒ కన్సల్టేంట్‌ ,రిటైర్ఖ్‌ ఐఏయస్‌ అదికారి రవిధింగ్రా, రాష్ట్ర గుడ్‌ గవర్నెన్స్‌ కేంద్ర డైరెక్టరు జనరల్‌ సిసియస్‌ ఏ సి నోడల్‌ అదికారిగా డా రాజీవ్‌ శర్మ, వున్నారని వీరు జిల్లాలో పర్యటించి ఇక్కడి స్థితిగతులను అద్యయనం చేస్తారన్నారు. కమిటి కి ఆహ్వనం పలికివారికి కావలసిన వసతి, సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని డిఆర్‌ఒ హేమసాగర్‌ కు సూచించారు. భద్రణ ఏర్పాట్లు కు జిల్లా పోలీసు అదికారిని కోరాలని డిఆర్‌ఒ కు సూచించారు. జిల్లాలో తక్కువ అబివృద్ది చెందిన ఒక గ్రామాన్ని, ఏక్కువగా అభివృద్ది చెందిన మరొక గ్రామాన్ని ఏంపిక చేయాలని జడ్పీ సిఇఒ వెంకటస్వామిక సూచించారు. ఈ కమిటి పర్యటన విషయమై జిల్లాలోని ఎంపి, ఎంఎల్‌ సి, జడ్పి చైర్‌ పర్సన్‌, మేయర్‌ లకు తెలియచేయాలన్నారు. జిల్లాలోని గుర్తింపుకలిగిన రాజకీయ పార్టీల అద్యక్షులకు జిల్లా స్థాయిలో వున్న యస్సి, యస్టి, బిసి, మైనారిటి , రైతులకు మహిళా సం%ఘాలకు కూడ తెలియచేయాలన్నారు … ఏంపిక చేసిన గ్రామాలకు సంబందించిన ఆర్ఖిఒ లు అనువాద కర్తలుగా వ్యవహరిస్తారన్నారు. కమిటి పర్యటన కార్యక్రమాన్ని మీడియా కవరేజ్‌ చేయాలని డిపిఆర్‌ఒ యం వి ప్ర సాద్‌,ఆడియోవీడియో రికార్డింగ్‌ చేయాలని డెప్యూటి ఏగ్జీక్యూటివ్‌ సమాచార ఇంజనీర్‌ఒ యస్‌ ఏ .. వ హాబ్‌కు సూచించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: