రైతు సంక్షేమమే పరమావధిగా వారి అభివృద్దే రాష్ట్ర పురోభివృద్దిగా భావించి ఉద్యానవన పంటల ద్వారా వారిని ప్రోత్సహించాలి : తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ఎం.రవిచంద్ర


రైతు సంక్షేమమే పరమావధిగా వారి అభివృద్దే రాష్ట్ర పురోభివృద్దిగా భావించి ఉద్యానవన పంటల ద్వారా వారిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.రవిచంద్ర అధికారులను కోరారు. స్థానిక కలెక్టరేట్‌ కోర్టు హాలు నందు ఉద్యానవన పధకాల అమలుపై నియమింపబడ్డ జిల్లా స్థాయి మంజూరు కమిటీ సమావేశం ఛైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.రవిచంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయించుకుని, వాటిని రైతులకు అందించడం ద్వారా అభివృద్దికి తోడ్పడాలన్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన, లాభసాటి కలిగిన ఉత్పత్తులను సాధించాలని, అలాగే రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని, సమగ్ర పంటల యాజమాన్య పంటలను ఆచరింపజేయాలన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా 50, 75 శాతాల సబ్సిడీపై పధకాలను అమలు పరచి రైతుల సర్వతోముఖాభివృద్దికి కృషి చేయాలన్నారు. రాష్ట్రీయ కృషీ వికాస్‌ యోజన కింద 2010-11 ఆర్థిక సంవత్సరానికిగానూ ఒక కోటి 92 లక్షల రూపాయలతో వివిధ పంటలకు గానూ సబ్సిడీతో కూడిన పధకాల నిర్వహణకు కమిటీ అనుమతితో జిల్లా కలెక్టర్‌ ఆమోద ముద్ర వేశారు. అలాగే 2009-10 లోని సవరించిన కార్యాచరణ ప్రణాలికకు, అలాగే 2009-10 కు సంబంధించిన బ్యాక్‌లాగ్‌ పధకాలను 2010-11లో నిర్వహణకుగానూ కమిటీ అనుమతించింది. 2009-10 ఖర్చయిన బడ్జెట్‌కు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు ఫైనలైజేషన్‌పై కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఏజెన్సీ ప్రాంతంలో అనువైన పంటల ద్వారా రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్‌ అన్నారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరిలో అంతర పంటగా వేస్తున్న కోకోను పూర్తి స్థాయిలో ప్రోత్సహించుటలో భాగంగా ఫ్లాట్‌ ఫారమ్‌లు నిర్మాణానికి బాపట్ల యూనివర్సిటీ నుండి ప్రాజెక్ట్‌ నివేదికను తీసుకురావాలని ఉద్యానవన శాఖ ఎ.డి.ని ఆదేశించారు. క్లస్టర్‌ విధానం, మినీ కిట్స్‌ సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యానవన పంటల అత్యధిక దిగుబడుల సాధన, సాంకేతిక సమగ్ర కూరగాయల ఉత్పత్తి, హార్వెస్ట్‌ నిర్వహణ, ఫారమ్‌ మెకనైజేషన్‌ తదితర కార్యక్రమాలను సబ్సిడీపై నిర్వహిస్తూ రైతాంగానికి తోడ్పడాలన్నారు. పధకాల అమలులో ఎస్‌.సి., ఎస్‌.టి. కాంపొనెంట్‌లు తప్పనిసరిగా పాటించాలని, ఆరోగ్య రీత్యా మంచి డిమాండ్‌ ఉన్న అల్లనేరేడు తోటల పెంపకంపై రైతులను ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు అడపా దుర్గేష్‌, రాజమండ్రి ఎ.డి. సుబ్రహ్మణ్యం, ఎ.పి.ఎం.ఐ.పి. పి.డి. షాజానాయక్‌, డ్వామా అడిషినల్‌ పి.డి. బాలసుబ్రహ్మణ్యం, హార్టికల్చరల్‌ ఆఫీసర్‌ సి.హెచ్‌.శ్రీనివాసరావు, ఉద్యానవన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: