బాలకార్మికులందర్నీ బడిలో చేర్పించాలి: విజయనగరం జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య


విజయనగరం: బాలకార్మికులందర్నీ బడిలో చేర్పించడంలో అన్ని శాఖల అధికారులు పాత్ర వహించాలని జిల్లా కలక్టర్ యం.వీరబ్రహ్మయ్య తెలిపారు. కలక్టరు ఛాంబరులో బాలకార్మిక వ్యవస్థ నిర్ములనపై నిర్వహించిన సమావేశం కలక్టరు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో ఏం చేస్తే ఒక్క బాలకార్మికుడు కూడా కనపడకుండా వుంటారంటే అది చేయడానికి సిద్ధంగా వున్నామని వెల్లడించారు. అన్ని రకాల వసతులుండి, నిధులుండి, ఇంతమంది అధికారులుండి ఇంకా బాలకార్మికులు, డ్రాపౌట్లు, ఇప్పటికీ పాఠశాలల్లో ఎన్రోల్‌ కాని వారు వున్నారంటే బాధగా వుందన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పిల్లవానిని బడిలో చేర్పించే బాధ్యత ప్రతి శాఖకు, ప్రతి అధికారికి వుందని తెలిపారు. అక్షర భారతిలో చదసువుకునే తల్లిదండ్రులు వారి పరిస్థితిలో వారి పిల్లలు లేకుండా చూసేలా వారికి అవగాహన కలిగించాలన్నారు. జిల్లా అంతటా 15 రోజులు పాటు సెప్టెంబరు 1 నుండి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి, గ్రామాల వారీగా గుర్తించి ఏదో ఒక పాఠశాలో చేర్పించడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఐకెపి పి.డి. వాసుదేవరావుకు, బాలకార్మిక సంస్థ పి .డి. మార్పు అమ్మాజీరావునకు, ఎపిసి ప్రభాకరరావునకు సూచించారు. బలవంతంగానైనా పిల్లల్ని బడిలో చేర్పించాలని అందుకు ఏ రకమైన సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధమని చెప్పారు. కులవృత్తుల వారి సంఘనాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కలిగించాలని తెలిపారు. సమావేశంలో డి .ఆర్‌ఒ .వై. నరసింహారావు, కార్మిక శాఖ కమిషనర్లు ఎల్లారావు, జనార్థనరావు, ఎన్సిఎల్‌పి మోనిటరింగ్‌ అధికారి సుగుణాకరరావు, జిల్లా ఉపాధి కల్పనాధికారి వై .వి. రత్నం, బాలకార్మికులపై, విద్యపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరైనారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: