ప్రజా సమస్యలపై దృష్టి


తిరుపతి: ప్రజాసమస్యలపై ఎంఎల్‌ఏలు సిఫారసు చేసిన ఉత్తరాలను సకాలంలో వాటి ఫలితాలు లబ్దిదారులకు అందజేయవలసిన బాధ్యత అధికారులపై వున్నదని, రాష్ట్ర శాసన సభ హక్కుల కమిటీ ఛైర్మన్‌ శ్రీ యం . మహీధర్‌ రెడ్డి తెలిపారు. స్థానిక పద్మావతి అతిథి గృహము నందు టి టి డి అధికారులతో జి.ఓ యం .ఎస్‌ .నెంబరు 741 గురించి సమీక్షా సమావేశం జరిపొరు. అనంతరం పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా కమిటీ ఏర్పడి 3 నెలలు అయిన సందర్భంగా 2004-05 సం . నందు ప్రోటోకాల్‌ అనులుకు ప్రభుత్వం జారీ చేసిన జి.వొ యం .ఎస్‌ .నెంబరు 741 కమిటీ సమావేశం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. వై.యస్‌.ఆర్‌. జిల్లా కలెక్టర్‌ రాకుండా మంగళవారం జరిగిన సమీక్షా సమావేశం నందు ఆయన హాజరు కాకపోవడం ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకొని వెళుతున్నామని ఆయన తెలిపారు. శాసన సభలో వారికి ఇచ్చిన విజ్ఞాపనలు, సూచనలు నెరవేర్చడం మా కమిటీ ప్రధాన ఉద్దేశమని ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లా నందు ఒక శాసన సభ్యుని సూచనలపైన ఒక డాక్టర్‌ పై విచారణ జరిపామని ఆయన తెలిపారు. మొట్టమొదటి ఈ కమటీ తిరుపతి పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లాలో మరియు కడప జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రజా సమస్యలపై ఎం ఎల్‌ ఏలు సిఫారసు చేసిన ఉత్తరాలను బట్వాడా చేసి రికార్డు రూపంలో భద్రపరచుకోవాలని అధికారులను హెచ్చరించారు. ఏ అధికారైనా నిర్లక్యం చేస్తే ఆ అధికారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. టి టి డి అధికారులకు వి ఐ పి ల ప్రతిని ప్రభుత్వం తరఫున అందజేస్తామని ఆయన తెలిపారు. త్వరలో ఎం ఎల్‌ ఏలు, ఎం ఎల్‌ సి లు , ఎం పిల సిఫారసుల ఉత్తరాల కొరకు వసతి, దర్శనం ఏర్పాట్ల కొరకు స్పెషల్‌ కౌంటర్లు ఏర్పాటు చేయుచున్నట్లు, వారి ఫోన్‌ నంబర్లు, ఫాక్స్‌ నంబర్లు ఈ మాసాంతానికి ఏర్పాటు చేయుచున్నట్లు టి టి డి అధికారులు తెలియ చేశారు. రోజుకు 100 మంది ఎం ఎల్‌ ఏల సిఫారసు లెటర్లతో వసతి, దర్శన సౌకర్యాలను ఏర్పాటు చేయుచున్నట్లు టి టి డి అధికారులు తెలియజేశారు. 2004-05 సం . నందు ప్రోటోకాల్‌ అనులుకు ప్రభుత్వం జారీ చేసిన జి.వొ యం .ఎస్‌ .నెంబరు 741 గురించి ఏ అధికారిని ప్రశ్నించినా సరియైన సమాధానం ఇవ్వలేదని ఆయన తెలిపారు. పూర్తి స్థాయిలో రాబోయే సంవత్సర కాలంలో కొన్ని దిపార్ట్‌మెంట్లపైనపర్యవేక్షణ జరిపి శాఖా పరమైన చర్యలు తీసుకొంటున్నామని ఆయన తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ఈ కమిటీ విస్తృతంగా పర్యటిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గా హాజరైన ఎం ఎల్‌ ఏలు శ్రీ కె. వెంకటరామిరెడ్డి (ధర్మవరం), శ్రీ కె. వెంకటనాగేశ్వరరావు (తణుకు), శ్రీ వి.వి.శివరామరాజు (భీమిలి), శ్రీపి. శ్రీసత్యనారాయణమూర్తి(పత్తిపాడు), మల్లాది విష్ణు (విజయవాడ), శ్రీ రామన్న జోగి (ఆదిలాబాద్‌) తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: