నకిలీ ఎరువులు, పురుగు మందుల విక్రయదారులపై నిఘా వేసి ఉంచాలి : కలెక్టర్‌ రవిచంద్ర


కాకినాడ: జిల్లాలో ఎక్కడైనా నకిలీ ఎరువులు, పురుగుమందుల విక్రయాలకు పాల్పడే డీలర్లపై నిఘా ఉంచి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎం.రవిచంద్ర వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కాకినాడ వ్యవసాయ శాఖ జె.డి. కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎరువులు, పురుగుమందుల అక్రమాలకు సంబంధించి బయటి వారు స్పందించే కంటే ముందుగా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమాలకు పాల్పడే డీలర్లపై ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని, క్వాలిటీ కంట్రోల్‌ చేసేందుకు ఆయా ఎరువులు, పురుగుమందుల శాంపిల్స్‌ తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా ఎరువులు, పురుగుమందులు కొరత రాకుండా చూడడంతో పాటు నకిలీ విక్రయాలపై సకాలంలో స్పందించి దాడులు చేసి అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రవిచంద్ర ఆదేశించారు. మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సరఫరాకు సంబంధించి పెద్దగా సమస్యలు లేవని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కౌలు రైతులకు ఋణ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన జాయింట్‌ లయబిలిటీ గ్రూపుల ఏర్పాటుకు సకాలంలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రూపులు ఏర్పాటు ద్వారా బ్యాంకు ఖాతాలు ప్రారంభింప చేసి వారికి ఋణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అందరు మండల వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఖాతాలు ప్రారంభించుటలోనూ, ఋణాలు మంజూరులోనూ ఏమైనా సమస్యలుంటే వెంటనే సంబంధిత బ్యాంకుల జిల్లా కో-ఆర్డినేటర్లతో మాట్లాడి వాటిని పరిష్కరించాలని వ్యవసాయ శాఖ జె.డి. టి.నందయ్యను ఆయన ఆదేశించారు. అనంతరం వరద సహాయక చర్యలు విషయమై మాట్లాడుతూ పంట నష్టం అంచనా వేసేందుకు త్వరితగతిన ఎన్యూమరేషన్‌ విధానాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ రవిచంద్ర ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతి మండలానికి వ్యవసాయ శాఖ ఎ.డి. నేతృత్వంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో పాటు బృందాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే గృహ నష్టాలను అంచనా వేసేందుకు రెవెన్యూ, గృహ నిర్మాణ తదితర శాఖలతో కూడిన ఎన్యూమరేషన్‌ బృందాలు పని చేస్తున్నాయని, వారి సహాయం కూడా ఇందుకు తీసుకుని త్వరితంగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అంతకు ముందు వ్యవసాయ శాఖ జె.డి. టి.నందయ్య ఆ శాఖ అధికారులతో శ్రీ వరి సాగు విధానం, ఎరువులు, విత్తనాలు సరఫరా తదితర అంశాల గురించి సమీక్షించారు. ఇంకా ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ డి.డి. డి.రామరాజు, పలువురు ఎ.డి.ఎ.లు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: