కళాశాలల్లో ర్యాగింగ్‌ నిరోధానికి కమిటీలు


విజయనగరం: ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జిల్లా కలక్టరు యం.వీరబ్రహ్మయ్య కళాశాలల్లో ర్యాగింగ్‌ నిరోధానికి కమిటీలను వేయడం ద్వారా ర్యాగింగ్‌ను అరికట్టవచ్చునని జిల్లా కలక్టరు యం.వీరబ్రహ్మయ్య తెలిపారు. కలక్టరేటు ఆడిటోరియంలో ర్యాగింగ్‌ నిరోధంపై జరిగిన వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టరు మాట్లాడుతూ ర్యాగింగును మొగ్గలోనే తుంచివేయాలని, లేనియెడల అది వ్యాధిలా వ్యాపిస్తుందని తెలిపారు. ర్యాగింగ్‌నకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మొదటగా ప్రిన్సిపాళ్లు చర్యలు చేపట్టాలని సూచించారు. అడ్మిషన్లు ప్రారంభమైన వెంటనే యాంటీ ర్యాగింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అదేవిధంగా అడ్మిషన్‌ సమయంలో స్టూడెంట్‌ వద్దనుండి ఎటువంటి ర్యాంగింగ్‌ నకు పాల్పడనని అండర్‌ టేకింగ్‌ తీసుకోవాలని సూచించారు. ఏదైనా చిన్న సంఘటన జరిగినా విద్యార్థులతో పాటు, సంస్థలకు కూడా చెడ్డ పేరు వస్తుందని, వారిజీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని కళాశాలల్లో విద్యావర్థులకు కౌన్సిలింగ్‌ చేయుటకుగానూ సైకాలజిస్ట్‌లను నియవించాలని సూచించారు. కమిటీల్లో మహిళా ఉపాధ్యాయులు, వార్డెను, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది తప్పక ఉండేలా చూడాలని చెప్పారు. కమిటీ సభ్యుల, వార్డెన్‌ సెల్‌ ఫోన్‌ నెంబరు అందరికీ కనపడేలా గోడలపై రాసి వుంచాలని, అదేవిధంగా ర్యాగింగ్‌కు పాల్పడితే ఎటువంటి శిక్షలకు గురవుతారో చట్టంలోని అంశాలను కూడా వివరంగా రాయించాలని తెలిపారు. జిల్లా ఎస్‌.పి.నవీన్‌ గులాటి మాట్లాడుతూ ర్యాగింగకు పాల్పడిన విద్యార్థులుపైన అదే విధంగా సంస్థలపైనా కూడా కేసులు పెట్టడం జరుగుతుందని తెలిపారు. ర్యాగింగ్‌ చట్టంలోని అంశాలన్నీ ప్రిన్సిపాళ్లు తెలుసుకోవాలని, అడ్మీషన్‌ ప్రాస్పెక్టస్‌లోనే అండర్‌ టేకింగ్‌ లెటర్‌ వుండాలని సూచించారు. 15 దినముల లోపే ఫ్రెషర్స్‌డేని జరపాలని, జూనియర్స్‌కు సీనియర్స్‌కు మధ్య స్నేహభావం కలిగేలా చేయాలని తెలిపారు. విద్యార్థుల, విద్యాసంస్థల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అందరికీ అవగాహన కలిగించడం ద్వారా ర్యాగింగ్‌ను అరికట్టవచ్చన్నారు. శిక్షలు కఠినంగా వుంటాయనే భయం వుంటే ర్యాగింగకు పాల్పడరని అభిప్రాయపడ్డారు. అదనపు జె.సి.యం.రామారావు కార్యక్రమానికి స్వాగతం పలికారు. రాఘవన్‌ కమిటీ సిఫార్సుల మేరకు యాంటీ ర్యాగింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ సైకాలజిష్ట్‌ల యూనియన్‌ తరపున ఎన్‌విఎస్‌. సూర్యనారాయణ పవర్‌ ర్యాగింగ్‌ నిరోధంపై పవర్పాయంట్‌ ప్రజెంటేషన్‌ చేసి చూపించారు. కార్యక్రమంలో డి.ఆర్‌.ఒ.వై. నరసింహారావు, ఆర్‌.డి.ఒలు ఢిల్లీరావు, అంబేద్కర్‌, కళాశాలల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, సైకాలజిస్టులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: