ఎరువుల సరఫరాలో పారదర్శకత: మంత్రి జూపల్లి


మహబూబ్ నగర్: ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన ఎరువుల సరఫరాలో పారదర్శకత వుండేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆయన మహబూబ్‌నగర్‌ లోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎరువుల సరఫరాపై వ్యవసాయాధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎరువుల పంపిణీ విధానంలో స్పష్టత లేదని అందువల్ల ఇకపై జిల్లాకు వచ్చే ఎరువును నియమ నిబంధనల ప్రకారం, కేటాయింపులు చేయాలని, ఎ సోసైటికి ఎంత ఇస్తున్నది నమోదు చేయాలని అలాగే సోసైటీల అద్యక్షులు సోసైటీకి ఎంత ఎరువులు కావాలో లిఖిత పూర్వకంగా వ్యవసాయ శాఖ జెడికి ఇండెంట్‌ పెట్టటంతో పాటు రశీదు పొందాలని సూచించారు. జిల్లాలో ఎరువుల డిమాండ్‌ను దృష్టిలో వుంచుకొని అదనంగా ఎరువులు కేటాయించాలని కోరినట్లు మంత్రి తెలిపారు. ఎరువుల పంపిణీలో అక్రమాలు జరిగితే ఎరువుల దుకాణ డీలర్ల లైసెన్సు రద్దు చేయటంతో పాటు అధికారులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. కోటకదిర ప్రాథమిక వ్యవసాయం సహకార సంఘం పరిధిలో 2.28 లక్షల రుపాయలు దుర్వినియోగంపై తక్షణమే సంబంధితులపై కేసు నమోదు చేయాలని డిసిఓ సుబ్రమణ్యంను ఆదేశించారు. కొన్ని సోసైటీలకు ఎక్కువ, మరికొన్ని సోసైటీలకు తక్కువ ఎరువులు కేటాయించటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్క్‌ ఫెడ్‌ ద్వారా సరఫరా చేసే ఎరువులకు కూడా రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. ఎరువుల డిమాండ్‌ను దృష్టిలో వుంచుకొని అన్ని సోసైటీలకు సమానంగా కేటాయించాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వినయ్‌ చంద్‌ ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ యం.పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ అన్ని సోసైటీలకు చైర్మన్లు ఎరువుల ఇండెంట్‌ను వ్యవసాయ శాఖ జెడికి ఇవ్వాలని అన్నారు. ఎరువులను జాగ్రత్తగా పంపిణీ చేయాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై వుందని అదే విధంగా సోసైటీ అధ్యక్షులు కూడా ఎరువుల పంపిణీపై శ్రద్ద వహించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 33 వేల టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు 19 వేల టన్నులు వచ్చిందని తెలిపారు. డిసిసిబి చైర్మన్‌ కె.వీరారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాలు నష్టాల్లో నడపటం లేదని, సోసైటీలకు ఎంత ఎరువు కేటాయించినా పంపిణీ చేస్తామని తెలిపారు. సోసైటీలకు తక్కువ ఎరువులు కేటాయించటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కె.దామోదర్‌ రెడ్డి, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ హరిశంకర్‌తో పాటు ఇతర అధికారులు తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: