ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు: విశాఖ జిల్లా కలెక్టర్‌ జె.శ్యామలరావు


విశాఖపట్నం: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువుల పంపిణీచేయాలని ఎరువుల డీలర్లను జిల్లా కలెక్టర్‌ జె.శ్యామలరావు కోరారు. కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టినట్లైతే చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో హోల్‌సేల్‌, రిటైల్‌ ఎరువుల డీలర్లు, పలు ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన అన్ని రకాల ఎరువులను రైతులకు సకాలంలో పంపిణీ చేయాలని కోరారు. ఎరువుల విక్రయాలలో లింక్‌ ప్రోడక్టులను తప్పని సరిగా కొనిగోలు చేయాలని రైతులపై వత్తిడి తేవద్దని డీలర్లను ఆదేశించారు. మార్కెట్‌ రిటైల్‌ ప్రైస్ ప్రకారమే ఎరువులను విక్రయించాలని సూచించారు. ఎరువులు కొనుగోలు చేసే రైతులకు తప్పని సరిగా రిసీదు జారీచేయాలన్నారు. ఎరువుల విక్రయాలలో ఎటు వంటి ఆరోపణలైనా వచ్చినట్లైతే, సంబందిత డీలర్లపై ఎరువుల నియంత్రణా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగునని హెచ్చరించారు. ఒకే బ్రాండు కంపెనీ ఎరువులను రైతులకు పంపిణీ చేయడం సాద్యమయ్యే పని కానందున, అన్ని బ్రాండ్ల ఎరువులను రైతులు కొనుగోలు చేసే విధంగా వారిని మోటివేట్‌ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించేందుకు ఆదర్శరైతుల సహాయాన్ని తీసుకోవాలని సూచించారు. ఎరువుల కంపెనీల నిర్వాహకులు, డీలర్ల మద్య నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ పోలా భాస్కర్‌, అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు భద్రాచలం, అన్ని డివిజన్ల సహాయ సంచాలకులు, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: