ఎరువులు, పురుగు మందులను అక్రమంగా నిల్వచేసే డీలర్లపై కఠిన చర్యలు


ఖమ్మం: ఎరువులు, పురుగు మందులను ఉద్దెశ్యపూర్వకంగా అక్రమంగా నిల్వచేసిన, తరలించిన డీలర్‌ పై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యన్‌.నాగేశ్వరరావు అన్నారు. కొణిజర్ల మండల కేంద్రంలో గ్రొమోర్‌ కంపేనీ యొక్క దుకానాన్ని జిల్లా కలెక్టర్‌ అకస్మికంగా తనిఖి చేశారు. మండలానికి చెందిన రైతు అవసరమైన ఎరువును అడిగినప్పుడు స్టాక్‌ ఉన్నప్పటికి లేదని అంటున్నారని జిల్లా కలెక్టర్కు పిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్‌ అట్టి రిటైల్‌ షాపును గురువారం అకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్బముగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలొ జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు కావలసిన ఎరువులను ఎప్పటికప్పుడు సంబందించిన వ్యవసారుశాఖ కమీషనర్తో మాట్లాడి తెప్పించుకుంటున్నామని చెప్పారు. జిల్లాకు వివిధ రకాలైన ఎరువులు రఖరీప్‌ కాలానికి 2 లక్షల టన్నుల ఎరువుల పంపే లక్ష్యం కాగా ఆగష్టు చివరి వరకు 1,32,722 మెట్రిక్‌ టన్నులు లక్ష్యం కాగా అందులో సమారు 80 వేల మెట్రిక్‌ టన్నులను డీలర్లకు పంపించడం జరిగిందన్నారు. రైతుల ఎక్కువగా ఒకే రకమైన ఎరువులను అడుగుతున్నారు దాని ప్రత్యామ్నాయ ఎరువులు ఉన్నప్పటికి ఎవ్వరు వాటి పై ఆసక్తి కనపరచడం లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం ఎరువులు సొసైటిలో అందజేయడం జరిగిందన్నారు. ఎక్కడైతే సొసైటిలకు బలోపేతంగా ఉన్నాయో అక్కడికి పంపించడం జరుగుతుందన్నారు. డీలర్లుగాని సొసైటిలు గాని ఎరువులను అక్రమంగా తరిలిస్తున్నట్లు దృష్టికి వచ్చిన వెంటనే వ్యవసారు, రెవెన్యూశాఖలచే విచారణ చేపించడం జరుగుచున్నదన్నారు. ఎరువుల పంపిణిలో శాంతి భద్రతలకు సమస్య ఉత్పన్నం కాకుండ చూడాలని ఆయన వ్యవసారు సంయుక్త సంచాలకులను అదేశించారు. ఈ మండలంలో సాగర్‌ కింద వరి పోలాలు ఎక్కువగా వేసుకుంటారని అదనంగా 150 టన్నులు యూరియా, కాంప్లెక్సు ఎరువులను అందజేయాలని జడ్పిటిసి రమేష్‌, జిల్లా కలెక్టరును కోరారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: