ఆరోగ్య ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక కృషి


హైదరాబాద్: జిల్లాలో ఆరోగ్య ప్రమాణాలు పెంచేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రత్యేక కృషి చేయాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ గుల్జార్‌ పేర్కొన్నారు. బుద్ద భవన్‌లో గల జిల్లా వైద్య శాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్యాధికారుల సమీక్షా సమావేశానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు పని విషయంలో ఒకే తాటిపై నడిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యుహెచ్‌ పి స్థాయి వైద్య సిబ్బంది ప్రతి సోమవారం మంగళవారం, గురువారాలలో తప్పనిసరిగా క్షేత్ర స్థాయి పర్యటించాలని ఆదేశించారు. పర్యటనలలో ప్రజలకు దగ్గరై వారికున్న ఆరోగ్య సమస్యలనుఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని నివృత్తి చేయాలన్నారు. యుహెచ్‌ పి స్థాయిలో జరిగే సమావేశంలో ఆశా వర్కర్లతో పాటు ఆరోగ్య మిత్రలను కూడా ఇన్వాల్వ్‌ చేయాలన్నారు. సర్కిల్‌ స్థాయిలో ప్రతినెల సమావేశాలను ఏర్పాటు చేసి ఆ సర్కిల్‌ లో అమలవుతున్న వైద్య విధానాలపై సమగ్రంగా పర్య వేక్షించాలని ప్రోగ్రామ్‌ అధికారులను ఆదేశించారు. టీబి, హెచ్‌ఐవి/ఏయిడ్స్‌, లెప్రసీ తదితరులు వైద్యులపై అధికారులు చెక్‌ పెట్టడంతో పాటు వ్యాధి సోకిన వారికి సకాలంలో వైద్యం అందించాలన్నారు. ఒక మహిళ గర్భం దాల్చిన దగ్గర నుండి ప్రసవం జరిగిన తరువాత, శిశువుకు టీకాలు వేసేంతవరకు, మాతా శిశు ఆరోగ్య విషయాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత వైద్య అధికారిపైనే ఉంటుందన్నారు. తల్లులకు పోషకాహార విలువలపై అవగాహన కల్పించేందుకు ఏఎన్‌ ఎంలతో కలిసి అంగన్‌ వాడివర్కర్లు పనిచేస్తారన్నారు. ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా మహిళలలో అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీలు ప్రసవం సమయంలో మరియు డెలివరీ తేదికి రెండు రోజుల ముందు 108 సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ఎక్కువగా ప్రభలుతాయి కనుక వాటిని అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయించుకునే వారిని ప్రభుత్వ రిఫరల్‌ ఆసుపత్రులకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంధత్వ నివారణలో భాగంగా నిరుపేదలైన 50 ఏళ్లు పై బడిన వారికి ఉచితంగా కళ్ల జోడును అందించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా ఆసుపత్రులలో ఎక్కడా మందుల కొరత లేదని అవసరమైన చోట వెంటనే తెప్పించడం జరుగుతుందన్నారు. కొన్ని చోట్ల ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల లోపం ఉన్నందున, వాటిని వెంటనే మరమ్మత్తులు చేపడుతున్నట్లు తెలిపారు. వైద్యాధికారులు వారి వృత్తిని కేవలం వృత్తిగానే కాకుండా సేవా భావంతో ప్రజలకు వైద్యాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌ సత్యానందం, డిఎం అండ్‌ హెచ్‌ ఒ డా.జయకుమారి, అడిషనల్‌ డిఎం అండ్‌ హెచ్‌ ఒ డా.పద్మజ, పి.డి. మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి రాజ్యలక్ష్మీ, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: