అంకిత భావంతో వైద్యసేవలందించండి: శ్రీకాకుళం జిల్లా కలక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్‌


శ్రీకాకుళం: వర్షాభావ పరిస్థితులలో ప్రబలుచున్న వ్యాధులను తక్షణమే గుర్తించి సత్వర వైద్యసేవలు అందించాలని జిల్లా కలక్టరు నాగులాపల్లి శ్రీకాంత్‌ వైద్యాధికారులను ఆదేశించారు. సీతంపేటలోని మారుమూల గిరిజన గూడలు కొండ ప్రదేశాలలో నున్న గ్రామాల సైతం కలక్టరు పర్యటించారు. ముందుగా పనసుమాను గూడ గ్రామం పర్యటించారు. ఇటీవల గుడికారం నుండి పనసుమాను గూడ గ్రామానికి వచ్చి మరణించిన ఆరికలడ్డు (13 సంవత్సరాలు) మరణంపై ఆరాతీసారు. గ్రామంలో ఎవరైనా డయేరియా, మలేరియాలతో బాధపడుతున్నారా అని గడప గడపకూ వెళ్ళి అడిగారు. ఎవ్వరికి ఎటువంటి వ్యాధులతోనూ లేమని గ్రామస్తులు తెలిపారు. అనంతరం సుమారు 3 కిలోమీటర్ల దూరం, కాలినడకన దుర్గమమైన మార్గం నుండి పర్యటించి కొండపైనున్న గడికారం గ్రామానికి పర్యటించారు. వ్యాధిగ్రస్తుల వివరాలడిగారు. కె. కురవయ్య 70 సంవత్సరాలు, టి.బి. వ్యాధి గ్రస్తుడు, కె. సావిత్రి 25సం., కె. అమ్మన్న 45 సం., జ్వరాలతో బాధపడుతున్నామని తెలిపారు. 15 సంత్సరాల ఉషారాణి డయేరియాలో తీవ్రంగా బాధపడుతున్నందున ఆమెను కొండనుండి క్రిందకి దింపి పాలకొండ ఆసుపత్రిలో సత్వరమే చికిత్స చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి విజయసారధిని ఆదేశించారు. అనంతరం ప్రాధమిక పాఠశాలను సందర్శించి విద్యార్ధులు ఆరిక రవి, బిడ్డిక లక్ష్మిలను పాఠ్యాంశాలపై ప్రశ్నంచి వారి సవాూధానాలకు తృప్తిచెందారు. కొండపైనున్న గడికారం గ్రామంలో సైతం ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు చక్కగా బోధిస్తున్నారనీ, వైద్యసేవలు కూడా సక్రమంగా అందిస్తున్నారని అన్నారు. అనంతరం కోసమాను గూడలో పర్యటించి జ్వరాలు, డయేరియా బాధితుల వివరాలు అడుగగా జ్వరంతో బాధపడుతున్న వారికి మలేరియా మాత్రలు పంపిణీ చేసామని వైద్య సిబ్బంది దగ్గరుండి వారిచే మాత్రలు మింగించడం చేస్తున్నట్లు జిల్లా మలేరియా అధికారి అరుణ్‌ కుమార్‌ తెలిపారు. ఆసుపత్రులలో మందుల కొరత లేదనీ, వైద్యాధికారులు నిరంతరం అప్రమత్తతతో వైద్యసేవలు అందించి అమాయక గిరిజనుల ప్రాణాలను పరిరక్షించాలని కలక్టరు తెలిపారు. అనంతరం కోసమాను గూడ ప్రాధమిక పాఠశాలను సందర్శించి విద్యార్ధినిలు సరిగా పాఠ్యాంశాలు చదువనందున ఉపాధ్యాయురాలిపై మండిపడ్డారు. వెనుకబడిన విద్యార్ధులకు ప్రత్యేక శ్రద్దతో బోధించి వారిని అభివృద్ది పరచాలని తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి. బి. విజయసారధి, జిల్లా మలేరియా అధికారి అరుణ్‌ కుమార్‌ సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజక్టు అధికారి బాబూరావునాయుడు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు టి.యస్‌.ఆర్‌. బాబ్జీ, సహాయ సంక్షేమ అధికారి పట్నాయక్‌, ఐ.సి.డి.యస్‌. పి.ఒ, వైద్య సిబ్బంది, తాశీల్దారు, ఎం.డి.ఒ, ఇతర అధికారులు వీరి పర్యటనలో పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: