పేదలకోసం ఎత్తిన జెండా కిందకు దిగదు: సీతారాం ఏచూరి


విజయవాడ: దేశంలో పెట్టుబడిదారీ విధానాలవల్ల పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పౌలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. ప్రజాక్షేమం కోసం తాము పోరాడుతూనే ఉంటామని పేదలకోసం ఎత్తిన జెండా కిందకు దిగదని అన్నారు. విజయవాడలో సీపీఎం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దేశ ఐక్యతకు భంగం మావోయిస్టులేనని ప్రధాని ప్రకటిస్తుంటే ఆయన ప్రభుత్వంలోని మంత్రి వారిని సమర్థిస్తున్నారని అన్నారు. దేశ ఐక్యతకు అసలైన ప్రమాదం అంతర్గతంగా పొంచి ఉందని మతతత్వమే పెద్ద ప్రమాదకారి అని అన్నారు. మతం ప్రాతిపదికగా ప్రజలను విడదీసి హిందూరాజ్య స్థాపనకు భాజపా కృషిచేస్తోందన్నారు.నాడు తమలోతాము కొట్టుకుని కురువంశం నాశనమైనట్లే భరతజాతి మతం ప్రాతిపదికన నాశనమయ్యే స్థితి ఏర్పడనుందన్నారు. శకునిలాగా ఆరెస్సెస్‌ అందుకు కంకణం కట్టుకుని పనిచేస్తోందన్నారు. మన దేశంలో అక్రమ మైనింగ్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, ఐపీఎల్‌ పేరిట కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. సీపీఎం దేశప్రజలపక్షాన నిలిచే పార్టీ అని అన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: