ప్రాణం పోసిన పుణ్య దంపతులు..!


ఆదివాసీలంటే భారతీయులు. భారతీయ జీవన వ్యవస్థలన్నీ ఆదివాసీల నుంచే అభివృద్ధి చెందాయి. అందుకే ఆదివాసీ గిరిజనులు భారతజాతికి మూల ఇంధనమంటారు. అలాంటి ఆదివాసీలను రాష్ట్రంలో బాహ్య ప్రపంచానికి పరిచయంచేసిన శాస్త్రవేత్తగా చరిత్రకెక్కారు హేమన్‌డార్ఫ్‌ దంపతులు. సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనమిదీ…

ఆదిలాబాద్‌లో దట్టమైన అడవుల ఒడిలో ఆదివాసీలు జీవనం కొన సాగిస్తున్నారు. ప్రపంచానికి దూరంగా ఉన్నవీరిపై ఇంగ్లాండ్‌కు చెందిన హేమన్‌డార్ఫ్‌ అధ్యయనం చేశారు. అప్పటికే ఆయన నెదర్‌ల్యాండ్‌, జార్ఖండ్‌లో అధ్యయనం చేసి 1930లో మహారాష్ట్రలో అడుగుపెట్టారు. రాష్ట్రంలో భద్రాచలం, విశాఖపట్టణం జిల్లాల్లో అధ్యయనం ముగించి ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లారు. అప్పుడు రాష్ట్రంలో కొమురంభీం ఉద్యమ సమయం. అది నిజాం సర్కారుకు సవాలుగా మారింది. ఆదివాసీలపై జరుగుతున్న దాడుల కారణాలను నిజాం సర్కారు పూర్తి వివరాలు సేకరించేందుకు పూనుకుంది. అప్పటికే ఆదివాసీలపై అవగాహన కలిగి ఉన్న డార్ఫ్‌ను నిజాం సర్కారు ఆసరగా తీసుకుంది. ఆయన నిజాంతో ఒప్పందం కుదుర్చుకొని ఆదిలాబాద్‌లో అడుగుపెట్టారు.

ఒప్పందంలో కారణాలతోపాటు వారి సంక్షేమానికి సంబంధించి నివేదిక సిద్ధం చేయడానికి హేమన్‌డార్ఫ్‌ నిజాంతో అనుమతి పొందారు. అధ్యయనం ప్రారంభించిన డార్ఫ్‌ గిరిజనులతో మమేకమై సంస్కృతీ సంప్రదాయాలను ఆచరించారు. సమస్యలపై ఆరాతీశారు. నిజాం ప్రభుత్వాన్ని భూపంపిణీ చేయడానికి నివేదిక అందించారు. అప్పుడు మొట్టమొదటిసారిగా ఆసిఫాబాద్‌, ఉట్నూరు గిరిజనులకు అటవీ భూమి పంపిణీ చేశారు. ప్రతిసమస్యపై అధ్యయనంచేస్తూ.. వారి సంక్షేమానికి నివేదికలు సిద్ధంచేశారు. విద్య,వైద్య రంగాల్లో పరిస్థితులు మెరుగు పడేందుకు ప్రణాళిక రూపొందించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రజాస్వామ్య బద్ధంగా ఈ సంక్షేమ పథకాలకు శ్రీకారాంచుట్టారు. ఐటీడీఏ ద్వారా సంక్షేమ పథకాలను అమలు జరగాలని నివేదికలు రూపొందించారు. ఆయన చేతులమీదుగా సంక్షేమ పథకాలకు చేపట్టారు.

అన్ని రంగాల్లో ముందుకు రావాలని తపించారు. రాజకీయ రంగాల్లో స్వర్గీయ ఆత్రం దేవ్‌షావ్‌ మాజీ ఎమ్మెల్యే, న్యాయ వ్యవస్థలో స్వర్గీయ కోట్నాక భీంరావు, గిరిజన ఎల్‌ ఎల్‌బీ పట్టభద్రుడు, అధికార యంత్రాంగంతో దివంగత ఐఏఎస్‌ మడావి తుకారాం, ప్రస్తుత ఏడీఎంఅండ్‌హెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న తొడసం చందు ఆయన తయారు చేసిన ఆణిముత్యాలే. దేశ విదేశీ సదస్సులో గిరిజనులపై నివేదికలను సమర్పించారు. ఎన్నో రచనలుచేసి భావి తరంకోసం సిద్ధంచేశారు. 1987లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన సభలో నివేదిక అందించేందుకు వివరాలు సేకరిస్తూనే… డార్ఫ్‌ సతీమణి బెట్టి ఎలిజబెత్‌ హైదరాబాద్‌లో మృతిచెందారు. ఆమె దినచర్య పుస్తకంలో రాసిన మేరకు గిరిజన గ్రామంలో గిరిజన సంప్రదాయ బద్ధంగా మార్లవాయి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు నికోలస్‌కు మార్లవాయి లచ్చుపటేల్‌ పేరు నామకరణం చేశారు. అమర వీరుడు కొమురంభీం ఆశయ సాధనకు నిరంతరం కృషి చేసిన డార్ఫ్‌ వృద్ధాప్య వయస్సులో స్వదేశానికి వెళ్లి మరణించారు.

నేటికీ అందని సంక్షేమ పథకాలు…
సంక్షేమ పథకాలు ఆదివాసుల దరిచేరడం లేదు. స్వార్థ రాజకీయం, అధికారుల నిర్లక్ష్యం గిరిజనేతరుల ఆధిపత్యం కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలేదు. ఈఏడాది ఏప్రిల్‌ 12న జిల్లాలో పర్యటించిన రాష్ట్ర గవర్నరు నర్సింహన్‌ ఆదివాసీ గిరిజనుల పరిస్థితులపై అధ్యయనం చేసిన తీరును గిరిజన సంఘాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. ఆయన స్వచ్ఛంద సంస్థ సీడీఆర్‌కు వత్తాసు పలకడం నిరాశకు గురి చేసిందని తుడుం దెబ్బ, గిరిజన ఐక్య వేదిక సంఘాల జిల్లా నాయకులు ఉయిక సంజీవ్‌, మెస్రం మోతీరాం ఆరోపిస్తున్నారు. ఏదేమైనా గిరిజనుల సంరక్షణకు ప్రత్యేక చట్టబద్ధంగా సంరక్షించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: