రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: సీఎం


గుంటూరు: రైతు సంక్షేమానికి ముఖ్యంగా వ్యవసాయ రంగం, నీటి పారుదల శాఖకు అధిక ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. ఆదివారం ఉదయం చీరాల ఐ.టి.సి సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, గృహా నిర్మాణశాఖ, నీటిపారుదల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లా అధికారులతో గౌ,, ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యవసాయ సీజన్‌లో రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎరువులు బ్లాక్‌మార్కెటింగ్‌ నిరోధించి అక్రమ వ్యాపారస్తులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి అనుకూలించి జిల్లాలో వర్షాలు సకాలంలో కురిసినందున జిల్లాలో రైతులకు ఉపశమనం కల్గిందన్నారు. అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించి చెరువులు, ప్రాజెక్టు అభివృద్ధి చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాలు సత్వరమే పూర్తిచేయాలని, అలాగే అర్హులైన లబ్దిదారులను ఎంపికచేయాలని తెలిపారు. ఇటీవల జిల్లాలో సంభవించిన లైలా తుఫాన్‌ వల న నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు వారికి పరిహారం చెల్లించేందుకు చర్యలు సక్రమంగా చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే నిర్దేశించిన అంశాలపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు వర్షపాతం 69.3 శాతం ఎక్కువగా నమోదైనందున రైతులకు మేలు జరిగే అవకాశం కలుగుతుందని, తదనుగుణంగా 4 వేల 257 క్వింటాళ్ల విత్తనాలు, 30 వేల 427 మెట్రిక్‌ టన్నుల ఎరువులు జిల్లాకు సరఫరా కాబడిందని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే రైతుసదస్సులు, రైతు చైతన్య యాత్రలు నిర్వహించి రైతులకు మేలైన వ్యవసాయ పద్దతులపై అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటివరకు 9 వేల 524 మంది రైతులకు 2 కోట్ల 56 లక్షలు పావలా వడ్డీ రుణాలు అందజేయడం జరిగిందని, అదేవిధంగా 14 వేల 500 మందికి పావలా వడ్డీ రుణాలు అందజేసేందుకు 2 కోట్ల 6 లక్షల రూపాయలు అవసరం అవుతుందని కలెక్టర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లాలోని ఉద్యానవన శాఖకు గత లైలా తుఫాన్‌ వలన 39 కోట్ల నష్టంకాగా దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని తదనుగుణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు సబ్సిడీ అందజేయాలన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల 40 వేల 204 గృహాలకుగాను ఒక లక్షా 11 వేల 722 గృహ నిర్మాణాలు పూర్తిచేయడం జరిగిందని, మిగిలినవి వివిధ దశల్లో వున్నాయని ముఖ్యమంత్రికి కలెక్టరు వివరించారు. జిల్లాలో 2 లక్షల 68 వేల 643 మంది సామాజిక పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ముంపుకు గురిఅవుతున్న వారికి ఆర్‌.ఆర్‌.ప్యాకేజి అందేలా చూడాలని అలాగే పొదిలిలో పొగాకు వేలానికి సంబంధించిన 3వ ప్లాట్‌ఫారమ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. శాసనమండలి సభ్యులు పోతుల రామారావు మాట్లాడుతూ పొగాకు పంటలో నాణ్యత తగ్గినందున రేటు తగ్గిందని ఈనేపధ్యంలో శనగపంట వైపు రైతులు మొగ్గుచూపుతున్నారని , శనగ విత్తనాలు రైతులకు ఎక్కువగా సరఫరా అయ్యేటట్లు చూడాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధరరెడ్డి మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై అందిస్తున్న విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టి రైతులకు అందేలా చూడాలన్నారు. పర్చూరు శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాగర్‌ నీరు చి వరి భూముల వరకు అందేలా చూడాలని, అర్హులైన లబ్దిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేసేటట్లు చూడాలన్నారు. చీరాల శాసనసభ్యులు ఆమంచి క్రిష్ణమోహన్‌ మాట్లాడుతూ జిల్లాలో విత్తనాల పంపిణీ సక్రమంగా జరిగేటట్లు చూడాలని అవకతవకలు పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు. దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌లు రైతులకు తత్కాల్‌ పథకంలో అందేలా చూడాలని, జిల్లాకు కేటాయించిన ట్రాన్స్‌ఫార్మర్‌లను త్వరితగతిన స్థాపన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొనివచ్చారు. యర్రగొండపాలెం శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్‌ 1, 2 పనులు త్వరితగతిన చేపట్టాలని, సర్వీస్‌ కనెక్షన్స్‌, లూజ్‌ కనెక్షన్స్‌కు విద్యుత్‌శాఖ అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలని కోరారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్‌.విజయకుమార్‌ మాట్లాడుతూ నాన్‌నోటిఫైడ్‌ చెరువులకు మరమ్మత్తులు చేపట్టేలా చూడాలన్నారు. కనిగిరి శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ఆదర్శ రైతుల పనితీరు సంతృప్తికరంగా లేదని మరలా ఆదర్శరైతులను ఎంపికచేసుకునే అవకాశం కల్పించాలని, లైలా తుఫాను వలన బత్తాయిపంటకు అపారనష్టం జరిగిందని నష్టపరిహారం రైతులకు అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, గనులు, భూగర్భవనరులు మరియు చేనేత, జౌళి శాఖామాత్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు జె.డి.శీలం, శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకరరావు, శిద్ధా రాఘవరావు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లాపరిషత్‌ ఛైర్‌పర్సన్‌ శ్రీమతి కాటం అరుణమ్మ, గుంటూరు రేంజ్‌ డి.ఐ.జి కిషోర్‌కుమార్‌, జిల్లా ఎస్‌.పి నరసింహారాజు, జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీ నృసింహం, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: