పోలీసుల వలలో మావోయిస్టు నేత?


హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ నేత వారణాసి సుబ్రహ్మణ్యంను పోలీసు వర్గాలు చుట్టుముట్టినట్లు వచ్చిన వార్తలతో ఆయనకు పోలీసులు హాని కలిగించవచ్చని మావోయిస్టు సానుభూతిపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విరసం సభ్యుడు వరవరరావు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం అలియాస్‌ శ్రీకాంత్‌ అలియాస్‌ సుకాంత్‌ను పోలీసు వర్గాలు ఢిల్లీ సమీపంలో ఎక్కడో చుట్టుముట్టాయని చెప్పారు. పోలీసులు సుబ్రహ్మణ్యాన్ని చుట్టుముట్టారని తమకు ప్రత్యేక సమాచారం అందిందని అయితే ఆయనను ఎక్కడ ఉంచారో తెలియదని ఆయన బహుశా ఢిల్లీలో ఉండచ్చని ఎందుకంటే ఆయన ఉత్తర భారతంలో తన కార్యకలాపాలను నిర్వహించేవారని రావు ఎక్స్‌ప్రెస్‌తో ఫోన్‌లో చెప్పారు. సుబ్రహ్మణ్యం ప్రకాశం జిల్లాకు చెందిన వారు. మావోయిస్టు పార్టీలో సీనియర్‌ సభ్యుడు. శ్రీకాకుళంలోను ఆతర్వాత సింగరేణి కార్మిక సంఘం (సికాస)లోను ఆయన పనిచేశారు. తర్వాత 1986లో ఉత్తర భారతానికి వెళ్లి కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. స్వామి అగ్నివేశ్‌ తనకు రాసిన ఉత్తరాన్ని ఆయన తన వద్ద ఉంచుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం, మావోయిస్టుల మధ్య అగ్నివేశ్‌ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఆలేఖను మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణపతికి చేరాలని ఉద్దేశించినట్లు తెలుస్తోందన్నారు. ఆంధ్రలో మావోయిస్టు పార్టీ సీనియర్‌ నేత అజాద్‌ ఎన్‌కౌంటర్‌కు గురైన తర్వాత స్వామి అగ్నివేశ్‌ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలుసుకున్నారు. మావోయిస్టులతో చర్చలకు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. కాని హోంమంత్రి పి.చిదంబరం అందుకు సుతరామూ అంగీకరించలేదు. పోలీసులు ఆయనకు హాని తలపెట్టవచ్చని ఆయనను కోర్టులో హాజరు పరచాలని వరవరరావు కోరారు. ప్రధాని జోక్యం కల్పించుకుని సుబ్రహ్మణ్యం సురక్షితంగా ఉండేట్లు చూడాలని కోరారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: