పిండ నిర్థారణ పరీక్షలపై ప్రత్యేక దృష్టి


కాకినాడ: గర్భధారణకు ముందు తర్వాత పిండ నిర్థారణ పరీక్షా ప్రక్రియ నియంత్రణ, దుర్వినియోగ నివారణ చట్టం 1994, 96ల లోని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ఎం.రవిచంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్‌లో పిండ నిర్థారణ పరీక్షా ప్రక్రియ, నియంత్రణ, దురుపయోగ నివారణ చట్టం 1994, 1996 (ప్రికన్సెప్సన్‌ అండ్‌ పేరెంటల్‌ డయాగ్నిస్టిక్‌ టెక్నిక్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ సెక్స్‌ సెల క్షన్‌ యాక్ట్‌)(పిసి అండ్‌ పి.ఎన్‌.డి.టి. యాక్ట్‌)పై జరిగి న జిల్లా స్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లడుతూ ఈ చట్టానికి సంబంధించిన నియమనిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మన దేశంలో స్త్రీ పురుషుల సంఖ్య సమానమైనా ఆడ పిల్లలపట్ల వివక్షత కొనసాగూనే ఉందని శిశువు తల్లి గర్భంలో ఉండగానే లింగ నిర్థారణ పరీక్షల ద్వారా ఆడ బిడ్డ అని తెలుసుకుని గర్భస్రావానికి ఒడి గట్టే కుటుంబాలు సమాజంలో కోకొల్లలుగా ఉన్నాయన్నారు. మన దేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ చట్టం నిర్వచనం ఏమంటే గర్భస్థ పిండ నిర్థారణ పద్దతులు అనగా అన్ని గర్భస్థ పరీక్షా పద్దతులు, పరీక్షా ప్రక్రియలు, వైద్య పద్దతులు అనగా అల్ట్రాసోనోగ్రఫీ, ఫీటస్కోఫీ, అమ్మీనోయిక్‌ ఫ్లూయిడ్‌ శాంపిల్స్‌ తీయుట, క్రానిక్‌విల్లి, రక్తం టిష్యూ సేకరణలు, గర్భస్త శిశు నిర్దారణకై జెనెటిక్‌ క్లినిక్‌కు పంపడం అని కలెక్టర్‌ రవిచంద పేర్కొన్నారు. గర్భస్థ పిండ నిర్థారణ ప్రక్రియ ద్వారా ఏ గర్భవతికి గాని ఆమె బంధువులకు గాని లింగ నిర్దారణ సమాచారం తెలుపరాదని ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని ఆయన తెలిపారు. అంతే గాక గర్భిస్త్రీ వయస్సు 35 సం.లు పైబడినా లేదా గతంలో రెండు అంత కన్నా ఎక్కువ సార్లు గర్భస్రావం జరిగినా లేదా హానికరమైన మందులు, అణుధార్మిక శక్తి, రసాయనాల ప్రభావానికి లోనైనా, కుటుంబంలో ఎవరికైనా మానసిక మాంధ్యం లేదా శారీరక వైకల్యం లేదా జన్యు సంబంధిత వ్యాధులు కలిగి ఉన్నా అల్ట్రా సౌండ్‌ లేదా అల్ట్రా స్కానింగ్‌ పరీక్షలు నిర్వహించవచ్చని చట్టం తెలియజేస్తోందన్నారు. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారిపై మొదటి సారి తప్పుకు 3 సంవత్సరాలు, జైలు శిక్ష, 10 వేల జరిమానా అదే తప్పు రెండో సారి చేస్తే 5 సంవత్పరాలు జైలు, 50 వేల జరిమానా విధించేందుకు వీలుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇదే శిక్ష లింగ నిర్థారణ ప్రక్రియ నిర్వహించే వారు, చేయించుకునే వారు లేదా ప్రోత్సహించే వారికి కూడా వర్తిస్తుందన్నారు. అలాగే చట్ట విరుద్దంగా లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించిన వైద్యుల పేర్లు రాష్ట్ర వైద్య మండలి నుండి 2 సంవత్సరాల పాటు తొలగిస్తారని అదే తప్పు రెండో సారి చేస్తే శాశ్వతంగా పేరు తొలగించడం జరుగుతందని వివరించారు. ఈ చట్టం క్రింద రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతించేందుకు చర్యలు తీసుకోవాలని డి.యం.హెచ్‌.ఓ.ను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు అదనపు జె.సి. బి.రామారావు, డి.ఎం.హెచ్‌.ఓ. డా.డి.విజయకుమార్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.వి.ఎస్‌.ఎస్‌.భాస్కరరావు, డి.పి.ఆర్‌.ఓ. వి.రామాంజనేయులు, డి.ఐ.ఓ. డా.మురళీకృష్ణ, అదనపు డి.యం.హెచ్‌.ఓ. పి.శ్యామ్‌ప్రసాద్‌, జిజిహెచ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎ.సత్యవాణి, మెడికల్‌ అధికారి కె.అనిత తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: