నగరాభివృద్దికి అందరూ సహకరించాలి


విశాఖపట్నం: విశాఖ నగరాభివృద్దికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ సహకరించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు కోరారు. ముఖ్యంగా నగర పరిధిలోనున్న ఏడుగురు శాసన సభ్యులు, మహా విశాఖ నగర పాలక సంస్థ ఉన్నత అధికారులు, పలు విభాగాల అదిపతులు నగరాభివృద్దిలో కీలక భూమిక పోషించాలని ఆయన సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జి.వి.ఎం.సి. పరిధిలో అమలవుచున్న జవహర్‌ లాల్‌ నెహ్రూ పట్టణ పునర్నిర్మాణ పథకం ప్రాజక్టులు, విలీన గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలను జి.వి.ఎం.సి.పరిధిలోకి తేవడం, పారిశుద్యం, వైద్య, ఆరోగ్యం తదితర అంశాలపై జి.వి.ఎం.సి. అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జి.వి.ఎం.సి. మేయర్‌ పులుసు జనార్థనరావు, శాసనసభ్యులు ముళ్లా విజయప్రసాద్‌, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, వెలగపూడి రామకృష్ణబాబు, కమీషనర్‌ వి.ఎన్‌.విష్ణు, జిల్లా కలెక్టర్‌ జె.శ్యామలరావు, జాయింట్‌ కలెక్టర్‌ పోలా భాస్కర్‌, జి.వి.ఎం.సి. పలు విభాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నగర పరిధిలో పలు పథకాల క్రింద మంజూరు చేస్తున్న గృహాలు నిజమైన లబ్దిదారులకు సత్వరమే అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గృహా నిర్మాణాలు, కేటాయింపులలో తీవ్రమైన జాప్యాన్ని నిరోదించాలన్నారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ పట్టణ పునర్నిర్మాణ పథకం క్రింద నిర్మిస్తున్న గృహ సముదాయాలు, రాజీవ్‌ గృహకల్ప గృహ సముదాయాలలో కనీస మౌలిక వసతులైన విద్యుత్‌, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర సదుపాయాల సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత మూడు నాలుగు నెలలుగా ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య ప్రకృతి సహకరించడం వల్ల పరిష్కారమైందని, ఈ సమస్యను శాశ్విత ప్రాతి పధికను పరిష్కరించేదుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగర పరిధిలో పలు రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణంలో ఉన్నందున రవాణా పరంగా ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆయా పనులను సత్వరమే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పరిపాలనా సౌలభ్యం కొరకు జి.వి.ఎం.సి. అధికారాలను వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందని, జి.వి.ఎం.సి. జోనల్‌ కార్యాలయాలకు సరైన అధికారాలు, సిబ్బంది, నిధులు కేటాయించే అంశంపై రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తానని మంత్రి తెలిపారు. విలీన గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలను జి.వి.ఎం.సి. పరిధిలోకి తెచ్చేవిషయంలో నెలకొన్న పరిపాలనా పరమైన సమస్యలపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిపి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి అన్నారు. జి.వి.ఎం.సి.లో పలు పోస్టులకు చెందిన ఎస్‌.టి.బ్యాక్‌లాగ్‌ ఖాళీలను నింపేందు చర్యలు తీసుకోవాలని మంత్రి కమీషనర్‌ వి.ఎన్‌.విష్ణని ఆదేశించారు. సై#్వన్‌ ప్లూ నియంత్రణకు జిల్లాలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను మంత్రి అభినందించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయానికి, చాతీ ఆసుపత్రి సై#్వన్‌ ప్లూ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలకు అవసరమైన నిధులను ప్రభుత్వ పరంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన వెల్లడిచేశారు. త్వరలో అర్హులందరికీ రేషన్‌ కార్డులు, రేషన్‌ సరుకులు, పించన్లు ఇంచేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుటుంన్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో కాలుష్య నియంత్రణకు ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకొనేందుకు పెద్ద ఎత్తున అన్ని వర్గాలతో చర్చలు జరిపి రూపొందించిన ప్రణాళికలకు త్వరలోనే అనుమలు లబించగలనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జి.వి.ఎం.సి.మేయర్‌ పులుసు జనార్థనరావు మాట్లాడుతూ పలువురు శాసన సభ్యులు ఆరోపించిన విధంగా జి.వి.ఎం.సి. పనుల నిర్వహణలో ప్రొటోకాల్‌ పాటించడం లేదని, కనీసం తన దృష్టికి తేకుండా కూడా పలు పనులను ప్రారంబిస్తున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపి ప్రొటోకాల్‌ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ప్రొటోకాల్‌ అతిక్రమించి వేసిన శిలాఫలకాలన్నింటినీ తొలగించాలని ఆయన కోరారు. ఇందిరమ్మ గృహాల కేటాయింపులో థర్డు పార్టీ వెరిఫికేషన్‌ సరిగా జరగలేదని , ఎంతో మంది అనర్హులకు గృహాలు కేటాయించినట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. ఫ్రొటోకాల్‌ సమస్య, అనర్హులకు గృహాల కేటాయింపులో తగు చర్యలు తీసుకోవాలని మంత్రి కమీషనర్‌ వి.ఎన్‌.విష్ణును ఆదేశించారు. జి.వి.ఎం.సి. కమీషనర్‌ వి.ఎన్‌.విష్ణు మాట్లాడుతూ కేంద్ర నిధులతో అమలు చేయబడుచున్న పలు కార్యక్రమాలలో విశాఖ నగరం దేశంలో అన్ని నగరాలలో ముందుండటం వల్ల, కేంద్ర ప్రభుత్వం నుండి పురస్కారాన్ని పొందడం జరిగిందని తెలిపారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ పట్టణ పునర్నిర్మాణ పథకం క్రింద రూ.1885 కోట్లతో చేపట్టిన పలు పలు ప్రగతిలో నున్నాయన్నారు. రాజీవ్‌ ఆవాస్‌ యోజనా పథకం క్రింద లక్ష గృహాలను నిర్మించేందుకు ప్రతిపాదించామని తద్వారా మురికి వాడలు లేని నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్‌ జె.శ్యామలరావు మాట్లాడుతూ జిల్లాలో సై#్వన్‌ ప్లూ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రక్క జిల్లాలలో తగిన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల విశాఖకు బయటి జిల్లాల నుండి ఎక్కువ మంది వ్యాధి గ్రస్తులు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అదనపు నిధులను మంజూరు చేయించాలని మంత్రిని ఆయన కోరారు. మధురవాడ రాజీవ్‌ గృహ కల్ప గృహ సముదాయంలో నాశిరకం పైపులను వినియోగించారు అని శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలకు కలెక్టర్‌ స్పందిస్తూ ఈ విషయంపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను ఆదేశించారు. 66 వ వార్డులోని ఎల్లపువాని పాలెం లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థానికులకు భూములను కేటాయించపోవడం పై విచారణ జరపాల్సినదిగా జాయింట్‌ కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. శాసనసభ్యులు పంచకర్ల రమేష్‌ బాబు మాట్లాడుతూ సింహాచలం కొండపై నివాసం ఉంటున్న కుటుంబాలను ఖాళీచేయించి కొండదిగువున నిర్మించిన కాలనీకి తరలించారని, కానీ ఆ కాలనీలో కనీస మౌలిక సధుపాయాలు లేక నివాశితులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనికి స్పందిస్తూ జి.వి.ఎం .సి. పరంగా ఆ కాలనీలో మౌలిక సధుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కమీషనర్‌ విష్ణును మంత్రి ఆదేశించారు. శాసనసభ్యులు చింతలపూడి వెంకట్రామయ్య మాట్లాడుతూ జి.వి.ఎం.సి. అధికారులు ప్రొటోకాల్‌ ను సరిగా పాలటించడం లేదని, జి.వి.ఎం.సి. పనుల ప్రారంభోత్సవాలని, శంకుస్థాపనలకు తమను ఆహ్వనించడం లేదని, శిలాఫలాకాలపై తమ పేర్లను ఎక్కడో ఒక మూల వేస్తున్నట్లు ఆరోపించారు. మేయర్‌ మరియు మిగిలిన శాస సభ్యులు ఈ ఆరోపణనను సమర్థించారు. దీనికి మంత్రి స్పందిస్తూ ఇకపై జి.వి.ఎం.సి. పనులను సంబందిత శాసనసభ్యులు దృష్టికి తీసుకువెళ్లి నిర్వహించాలని, ఫ్రొటోకాల్‌ సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. పలు కాలణాలవల్ల నిర్వాశితులైన పేదలకు గృహాలను మంజూరు చేసి, లాటరీ ద్వారా కేటాయించిన వాటిని కూడా జి.వి.ఎం.సి. అధికారులు నిలుపుదల చేశారని శాసనసభ్యులు మళ్లా విజయ ప్రసాద్‌ మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని పరిశీలించి తగుచర్య తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదే విధంగా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు తన నియోజక వర్గ పరిధిలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి జి.వి.ఎం.సి. అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జి.వి.ఎం.సి. ఎ.డి.సి.లు కృష్ణమూర్తి, రమేష్‌, చీఫ్‌ ఇంజనీర్‌ జయవరామి రెడ్డి, సి.ఎం.ఓ. డా.అబ్బులు, ఎస్‌.ఇ. చంద్రయ్య మరియు పలు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: