తొలగించటం బాధాకరం: గట్టు


హైదరాబాద్‌: అకారణంగా తనను కాంగ్రెస్‌ అనుబంధ సంస్థ కిసాన్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించటం బాధాకరమని గట్టు రామచంద్రరావు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా నిర్ణయం తీసుకోవటం అత్యంత దురదృష్టకరమన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎన్నడూ ప్రవర్తించలేదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రను సమర్థించటం, అంబటి రాంబాబు సస్పెన్షన్‌ను వ్యతిరేకించటమే తాను చేసిన తప్పా అని రామచంద్రరావు ప్రశ్నించారు. ఓదార్పు యాత్రను సమర్థించటమే తప్పు అయితే దాన్ని తాను తప్పుగా భావించటం లేదన్నారు. పదవి నుంచి తప్పించిన విషయంపై తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడిని కూడా కాదని కొందరు చెప్పటం సరికాదని గట్టు అన్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమక్షంలోనే తాను పార్టీలో చేరానన్నారు. సీనియర్ల పేరుతో కొందరు కాంగ్రెస్‌ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: