జ్వరపీడితులకు మంత్రి బాలరాజు పరామర్శ


విశాఖపట్నం: విషజ్వరాలు విజృంభించి తీవ్రత అస్వస్థతకు గురై అగనంపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుచున్న 30 మంది విద్యార్థులను మంగళవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు పరామర్శించారు. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోనున్న 57 వ వార్డులోని వెదుళ్లనరవ చిల్డ్రన్‌ ఫెయిత్‌ హోమ్‌లోని విద్యార్థులు సోమవారం విషజ్వరాల వల్ల ఆకశ్మికంగా అస్వస్థతకు గురైన విషయం విదితమే. ఈ విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందిస్తూ మంగళవారం స్వయంగా ఆసుపత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. ఆసుపత్రిలో ఏ విధంగా వైద్య సేవలు అందుతున్నాయి, ఏమేరకు ఆరోగ్యం కుదుట పడిందని అస్వస్థతకు గురైన పిల్లలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల యొక్క ఆరోగ్య స్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎటు వంటి అసౌకర్యం లేకుండా విద్యార్థులకు చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి.ఎస్‌.నాయక్‌ ను ఆదేశించారు. చాలా మంది పిల్లల ఆరోగ్యం కుదుటపడిందని, ఒకళిద్దరు విద్యార్థులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారని, ఈ సాయంత్రానికి కొంతమంది విద్యార్థులను ఆసుపత్రి నుండి డిస్చార్జి చేసున్నట్లు సూపరింటెండెంట్‌ బి.ఎస్‌.నాయక్‌ మంత్రికి వివరించారు. ఈ సందర్బంగా వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల జిల్లా కో-ఆర్డినేటర్‌ బి.కె.నాయక్‌ మాట్లాడుతూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగైందని మంత్రికి వివరించారు. అస్వస్థతకు అంతమంది పిల్లలు గురి కావడానికి గల కారణాలను విద్యాసంస్థ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణంలోని మార్పులే ఇందుకు కారణమని వైద్యులు మంత్రికి వివరించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: