ఎవరిపనైపోయిందో చూద్దాం: బాబు


హైదరాబాద్‌: ”తెలంగాణ ప్రాంతంతో పాటుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బేషుగ్గా ఉంది. 2014 ఎన్నికల్లో ఎదురులేని మెజార్టీతో అధికారంలోకి వస్తాం…” తెలంగాణ ప్రాంతంలో ఇటీవలి ఉపఎన్నికల్లో పార్టీ చావుదెబ్బ తిన్న తర్వాత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైవిధంగా వ్యాఖ్యానించారు. ”తెలంగాణ ఉపఎన్నికల్లో మేం ఓడిపోయినంత మాత్రాన మా పని అయిపోయిందని మీరు రాయకూడదు. పార్టీ ఎన్నికల్లో ఓడిపోవటమనేది కొన్ని సార్లు సహజం. దానర్థం దారి మూసుకుపోయిందని కాదు” అని వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో తమ పార్టీ తిరిగి పుంజుకుంటుందనే తన వాదనను నాయుడు సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ”రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన తర్వాత 1991 లోక్‌సభ ఎన్నికల్లో మా అభ్యర్థులు ఓడిపోయారు. కానీ 1994 సంవత్సరంలో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మేం ఘనమైన మెజార్టీ సాధించాం. 1996 లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో మంచి మెజార్టీతో మేం గెలిచాం” అని ఆయన వివరించారు. టిడిపి ధరావత్తులను కూడా కోల్పోయిందనటం పెద్ద విశేషం కాదని ఆయన అన్నారు. 2009 ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు కూడా ధరావత్తులు కోల్పోయారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతం కోసం ప్రత్యేక శాఖ కావాలని టిడిపి నేతలు కోరుతున్నారంటూ అడిగిన ప్రశ్నకు టిడిపి అధినేత బదులిస్తూ తెలంగాణ కోసం పార్టీలో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసే ప్రతిపాదనేది లేదని చెప్పారు. ”రాష్ట్రంలో ఒకే పార్టీకి రెండు శాఖలుండవు” అని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఏ ప్రాంతానికి చెందినవారైనప్పటికీ వారందరి ప్రయోజనాలను పరిరక్షించే ప్రతి ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తుందని ఆయన చెప్పారు. గత 30 సంవత్సరాలుగా పార్టీ అనుసరిస్తున్న మార్గదర్శక సిద్ధాంతం ఇదేనని, భవిష్యత్తులో సైతం దాని నుంచి పక్కకు వెళ్లే ప్రసక్తి లేదని టిడిపి అధినేత తేల్చి చెప్పారు. ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు వారి ప్రయోజనాల కోసం ఆందోళన చేపట్టడంలో తప్పు లేదని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. మంగళవారం డోర్నకల్‌లో ఒక యువకుడు ‘ఆత్మహత్య’ చేసుకోవటంపై ప్రశ్నించగా ఆందోళన చేస్తున్న క్రమంలో వారి జీవితాలను బలిదానం చేయరాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశం కేంద్రం, కాంగ్రెస్‌ ఎదుట ఉన్నందున దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని ఆయన అన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: